News


మార్కెట్లోకి హీరో బీఎస్‌-6 స్ల్పెండర్‌ ఐస్మార్ట్‌

Friday 8th November 2019
news_main1573185688.png-29436

  • ధర రూ. 64,900

న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ‘హీరో మోటొకార్ప్‌’.. భారత్‌ స్టేజ్‌–6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న స్ల్పెండర్‌ ఐస్మార్ట్‌ బైక్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 64,900. ఈ నూతన బైక్‌లో 110సీసీ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్‌ను అమర్చింది. మునుపటి తరంతో పోల్చితే ఇది అధిక టార్క్‌ని, మైలేజిని ఇస్తుందని కంపెనీ వివరించింది. జైపూర్‌లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్‌ టెక్నాలజీ (సీఐటీ)లో అభివృద్ధి పరచిన ఈ బైక్‌ దేశంలోనే తొలి బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా విడుదలైన తొలి మోటార్‌సైకిల్‌ అని సంస్థ గ్లోబల్‌ ప్రొడక్ట్‌ హెడ్‌ మాలో లీ మాసన్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కస్టమర్ల ఆసక్తిని చూసి దశలవారీగా ఉత్పత్తిని కొనసాగిస్తామని సేల్స్‌ హెడ్‌ సంజయ్ భాన్ అన్నారు. 



You may be interested

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 57 ఐసీఐసీఐ బ్యాంక్‌ బ్రాంచీలు

Friday 8th November 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్యాంక్‌లతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని.. వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223, ఏటీఎంలు 1,580 ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2019–20లో

భారత్‌ అవుట్‌లుక్‌ తగ్గించిన మూడీస్‌

Friday 8th November 2019

భారత క్రెడిట్‌ రేటింగ్స్‌ అవుట్‌లుక్‌ను నెగిటివ్‌కి తగ్గిస్తున్నట్లు ప్రముఖ రేటింగ్‌ ఏజన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ప్రకటించింది. ఇలా రేటింగ్‌ నెగిటివ్‌గా మార్చడం డౌన్‌గ్రేడ్‌కు తొలి మెట్టుగా భావిస్తుంటారు. ఎకానమీలో ఆర్థిక మందగమన భయాలు పెరుగుతున్న తరుణంలో మూడీస్‌ ఈ ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెటరీ లోటు జీడీపీలో 3.7 శాతానికి చేరుతుందని మూడీస్‌ అంచనా వేసింది. ఇది ప్రభుత్వ అంచనా 3.3 శాతం కన్నా అధికం.

Most from this category