News


‘హీరో’ లాభం 10 శాతం డౌన్‌

Thursday 24th October 2019
news_main1571887991.png-29096

  • రూ.884 కోట్లకు తగ్గిన నికర లాభం 
  • 21 శాతం తగ్గిన విక్రయాలు 
  • త్వరలో బీఎస్‌-సిక్స్‌ బైక్‌లు 

న్యూఢిల్లీ: టూ వీలర్‌ దిగ్గజం హీరో మోటొకార్ప్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.982 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.884 కోట్లకు తగ్గిందని హీరో మోటొకార్ప్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.9,168 కోట్ల నుంచి రూ.7,661 కోట్లకు తగ్గిందని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, నిరంజన్‌ గుప్తా తెలిపారు. ఈ క్యూ2లో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) పథకాన్ని తెచ్చామని, వీఆర్‌ఎస్‌కు అంగీకరించిన ఉద్యోగుల కోసం రూ.60 కోట్లు కేటాయింపులు జరిపామని, ఆ మేరకు నికర లాభం ప్రభావితమైందని వివరించారు. రూ.1,101 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించామని తెలిపారు. గత క్యూ2లో 15.2 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్‌ ఈ క్యూ2లో 14.5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. 
21 శాతం తగ్గిన వాహన విక్రయాలు ...
గత క్యూ2లో 21.3 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ2లో 21 శాతం తగ్గి 16.91 లక్షలకు చేరాయని గుప్తా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో మొత్తం ఐదు కొత్త మోడల్‌ టూవీలర్లను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. వీటిల్లో మూడు ప్రీమియమ్‌ బైక్‌లు కాగా, రెండు స్కూటర్ల మోడళ్లు ఉన్నాయి. ఈ మోడళ్లన్నింటికీ వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని గుప్తా వెల్లడించారు.    కాగా తొలిసారిగా టూ వీలర్లను కొనుగోలు చేసే వారిని దృష్టిలో పెట్టుకొని వివిధ వైవిధ్యభరితమైన పథకాలను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ సేల్స్‌ హెడ్‌ సంజయ్‌ భాన్‌ తెలిపారు. పండుగల సీజన్‌లో అమ్మకాల పెంచుకోవడానికి ఈ పథకాలు ఇతోధికంగా తోడ్పడ్డాయని వివరించారు. ఈ పండుగల సీజన్‌లో రిటైల్‌ అమ్మకాలు నిలకడగా ఉన్నాయని చెప్పారు. త్వరలోనే... పండుగల సీజన్‌ ముగిసిన తర్వాత  భారత్‌ స్టేజ్‌-సిక్స్‌ మోటార్‌ బైక్‌లను అందుబాటులోకి తేనున్నామని సంజయ్‌ భాన్‌ చెప్పారు. 



You may be interested

బజాజ్‌ ఆటో లాభం రూ.1,523 కోట్లు

Thursday 24th October 2019

21 శాతం వృద్ధి  4 శాతం తగ్గిన మొత్తం ఆదాయం  అమ్మకాలు 12 శాతం డౌన్‌  న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,523 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.1,257 కోట్లు)తో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ ఆటో తెలిపింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనం కారణంగా రూ.182 కోట్ల పన్ను

వైద్య సేవల్లోకి కత్రియ గ్రూప్‌

Thursday 24th October 2019

ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్‌ ఏర్పాటు మొత్తం రూ.350 కోట్ల పెట్టుబడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఆతిథ్య రంగంలో ఉన్న కత్రియ గ్రూప్‌ వైద్య సేవల్లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లోని బాచుపల్లి వద్ద ఎస్‌ఎల్‌జీ పేరుతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 550 పడకలు అందుబాటులోకి వచ్చాయని సంస్థ సీఎండీ దండు శివ రామ రాజు బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. 2022 నాటికి ఆసుపత్రిని 999 పడకల స్థాయికి చేరుస్తామని వెల్లడించారు. మొత్తం ప్రాజెక్టు

Most from this category