News


ఇంటి వద్దకే బైక్‌, స్కూటర్‌ డెలివరీ

Monday 5th August 2019
news_main1564992171.png-27547

  • హీరో మోటోకార్ప్‌ ప్రణాళికలు

న్యూఢిల్లీ: దేశ ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రగామిగా ఉన్న హీరో మోటోకార్ప్‌ బైక్‌, స్కూటర్లను కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేసే ప్రణాళికలతో ఉంది. ఇప్పటికే ముంబై, బెంగళూరు, నోయిడాలో ఈ సేవలను ఆరంభించగా, రానున్న కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా మరో 25 పట్టణాలకు విస్తరించాలనుకుంటోంది. ‘‘వినూత్న విధానాల అబివృద్ధికి, కస్టమర్లకు మెరుగైన అనుభవాన్నిచ్చే వ్యాపార నమూనాల కోసం పెట్టుబడులు పెడుతూనే ఉన్నాం. మా నూతన విధానం ద్విచక్ర వాహన మార్కెట్లో కస్టమర్ల అనుభవాన్ని మరింత పెంచుతుంది’’ అని హీరోమోటోకార్ప్‌ సేల్స్‌ విభాగం హెడ్‌ సంజయ్‌ భాను తెలిపారు. కస్టమర్ల ఇంటి వద్దకే కాకుండా, వారు కోరుకున్న చిరునామాకు బైక్‌ లేదా స్కూటర్‌ను అందిస్తామని ప్రకటించారు. 



You may be interested

వృద్ధి 9 శాతం సాధించాలి..

Monday 5th August 2019

అప్పుడే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యం ఈవై నివేదిక న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించుకున్నట్లుగా భారత్ 5 లక్షల కోట్ల (ట్రిలియన్‌) డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే వరుసగా అయిదేళ్ల పాటు ఏటా 9 శాతం మేర వృద్ధి చెందాల్సి ఉంటుందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై పేర్కొంది. అలాగే, మొత్తం పెట్టుబడుల రేటు కూడా స్థూల దేశీయోత్పత్తిలో 38 శాతానికి పెరగాల్సి ఉంటుందని ఎకానమీ వాచ్ పేరిట రూపొందించిన ఒక

మార్కెట్‌ దిశ ఎటు!

Monday 5th August 2019

-ఆర్‌బీఐ పాలసీ, ఎఫ్‌పీఐలకు పన్ను ఊరట అంశాలపై దృష్టి  - బుధవారం కీలక వడ్డీ రేట్ల ప్రకటన - 25 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు ఉండవచ్చని అంచనా.. - చైనా-అమెరికా వాణిజ్య చర్చలపై మార్కెట్‌ దృష్టి - ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, టైటాన్, హెచ్‌సీఎల్‌, బీపీసీఎల్‌, ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ క్యూ1 ఫలితాలు ఈవారంలోనే.. ముంబై: గడిచిన నాలుగు వారాల్లో ఆరు శాతం నష్టాలను నమోదుచేసి, బేర్‌ గుప్పిట్లో ఉన్న అంశాన్ని

Most from this category