News


హీరో మోటోకార్ప్‌ భారీ విస్తరణ ప్రణాళికలు

Wednesday 19th February 2020
news_main1582081358.png-31908

  • వచ్చే 5-7 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌.. భారీ విస్తరణ ప్రణాళికలను చేపట్టనుంది. ప్రత్యామ్నాయ వాహన పరిశోధన- అభివృద్ధి, స్థిర ఉత్పాదక సౌకర్యాల ఏర్పాటు, నెట్‌వర్క్ విస్తరణ, ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌ను విస్తరింపచేయడం వంటి అంశాలపై తాజాగా దృష్టిసారించింది. ఇందు కోసం వచ్చే 5-7 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ ప్రకటించారు. ఈ ఏడాదిలో 10 కోట్ల వాహన విక్రయాల మైలురాయిని అధిగమించే అవకాశం ఉందని వెల్లడించారు.

  • బీఎస్‌-6 గ్లామర్ విడుదల

భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్ఘార నిబంధనలకు అనుగుణంగా ఉన్న హీరో గ్లామర్ బైక్‌ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధరల శ్రేణి రూ. 68,900– 72,000 కాగా, ప్యాషన్ ప్రో ధరల శ్రేణి రూ. 64,990– 67,190గా నిర్ణయించింది. ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. 



You may be interested

ఎల్‌ఐసీ ఐపీఓకు రావడం మంచిదే !

Wednesday 19th February 2020

ఈ ప్రతిపాదనేదీ ఇప్పటివరకూ రాలేదు  వెల్లడించిన ఐఆర్‌డీఏఐ చైర్మన్‌  ముంబై: ఎల్‌ఐసీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు సంబంధించిన ప్రతిపాదన ఏదీ  ప్రస్తుతానికైతే తమ వద్దకు రాలేదని బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్‌డీఏఐ తెలిపింది. పారదర్శకత, ఇతర అంశాల దృష్ట్యా చూస్తే, ఎల్‌ఐసీ ఐపీఓకు  రావడం మంచి ప్రయత్నమేనని ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ ఎస్‌.సి. కుంతియా పేర్కొన్నారు. అసలు ప్రతీ బీమా కంపెనీ కూడా స్టాక్‌ మార్కెట్లో లిస్టయితే మంచిదని వివరించారు. బీమా పాలసీల్లో ఇన్వెస్ట్‌

ఏజీఆర్‌ 'పరిష్కారం'పై వొడా-ఐడియా కసరత్తు..

Wednesday 19th February 2020

టెలికం కార్యదర్శితో చైర్మన్ బిర్లా భేటీ న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బాకీల కారణంగా దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్‌) .. ఈ సమస్య నుంచి గట్టెక్కడంపై కసరత్తు చేస్తోంది. కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా .. మంగళవారం కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సాగిన చర్చల్లో వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ కూడా పాల్గొన్నారు.

Most from this category