News


హీరో మోటొకార్ప్‌ డివిడెండ్‌ రూ.65

Friday 7th February 2020
news_main1581045305.png-31583

 

  • హీరో మోటొకార్ప్ లాభం రూ.905 కోట్లు 
  • 17 శాతం వృద్ధి 

న్యూఢిల్లీ: టూవీలర్‌ దిగ్గజం హీరో మోటొకార్ప్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 17 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.773 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.905 కోట్లకు పెరిగిందని హీరో మోటొకార్ప్‌ సీఎఫ్‌ఓ నిరంజన్‌ గుప్తా తెలిపారు. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.7,937 కోట్ల నుంచి రూ.7,075 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.65 డివిడెండ్‌(3,250 శాతం) ఇవ్వనున్నమని తెలిపారు. 

సెప్టెంబర్‌ నుంచి మంచి రోజులు...
ఆర్థిక మందగమనం కారణంగా టూవీలర్‌ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని గుప్తా చెప్పారు. రబీ పంటలు బాగా పండటం, ఇంకా ఇతర సానుకూలాంశాల కారణంగా గ్రామీణ ఆదాయాలు మెరుగుపడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ (వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం) నుంచి అమ్మకాలు పుంజుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. 



You may be interested

నిఫ్టీ మద్దతు 12,095, నిరోధం 12,171

Friday 7th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 10 పాయింట్లు మైనస్‌ గురువారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్‌ నేలచూపుల్లో ఆసియా మార్కెట్లు నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర నీరసంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 10 పాయింట్లు క్షీణించి 12,121 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,131 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా..

సన్‌ ఫార్మా లాభం 26 శాతం డౌన్‌

Friday 7th February 2020

పెరిగిన నికర వ్యయాల ప్రభావం ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సన్‌ ఫార్యాస్యూటికల్స్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో 26 శాతం తగ్గింది.  గత క్యూ3లో రూ.1,242 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.914 కోట్లకు తగ్గిందని సన్‌ ఫార్మా తెలిపింది. వ్యయాలు రూ.6,203 కోట్ల నుంచి రూ.6,923 కోట్లకు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని

Most from this category