STOCKS

News


హీరో మోటార్స్ లాభం 36 శాతం అప్‌

Wednesday 31st July 2019
news_main1564555680.png-27440

  • క్యూ1లో రూ. 1,257 కోట్లు

న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,257 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 925 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. జాతీయ విపత్తు సహాయక నిధి కోసం గతంలో కేటాయించిన రూ. 737 కోట్లు రీఫండ్ కావడం.. తాజాగా లాభాల వృద్ధికి కారణమైందని సంస్థ వెల్లడించింది. ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ ఆదాయం రూ. 8,913 కోట్ల నుంచి రూ. 8,186 కోట్లకు తగ్గింది. హరిద్వార్‌లోని ప్లాంటుపై సెస్సుకు సంబంధించి జాతీయ విపత్తు సహాయక నిధికి నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాలన్న ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని, దీంతో రీఫండ్‌గా వస్తున్న ఆ మొత్తాన్ని ఆర్థిక ఫలితాల్లో ప్రత్యేక అంశంగా పేర్కొనడం జరిగిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. తొలి త్రైమాసికంలో ఆర్థిక పరిస్థితులు, కస్టమర్ల సెంటిమెంటు అంత ఆశావహంగా లేని ప్రభావం.. ఆటో రంగం పనితీరుపై ప్రస్ఫుటంగా కనిపించిందని సంస్థ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా తెలిపారు. 

వినియోగం పెంచే చర్యలు తీసుకోవాలి...
వర్షపాతం, పండుగ సీజన్‌ అమ్మకాలు, ద్రవ్య లభ్యత మెరుగుపడటం వంటి అనేక అంశాలపై మిగతా సంవత్సరం అంచనాలు ఆధారపడి ఉంటాయని గుప్తా వివరించారు. ఆటో పరిశ్రమపై అనేకమంది ఉపాధి ఆధారపడి ఉన్నందున.. వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. "ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం విధిస్తున్న జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరుతున్నాం. ఈ చర్యతో ఆటో రంగానికి గణనీయంగా ఊరట లభించగలదు" అని గుప్తా తెలిపారు. జీఎస్‌టీని తగ్గిస్తే ద్విచక్ర వాహనాల ధరలు కూడ తగ్గుతాయని, డిమాండ్‌కి ఊతం లభించగలదని ఆయన వివరించారు. విలువపరంగా తగ్గినా.. అమ్మకాల పరిమాణం పెరుగుతుంది కనుక ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయానికి కూడా ఢోకా ఉండబోదన్నారు.You may be interested

ఆంధ్ర సిమెంట్స్ నికర నష్టం రూ.36.94 కోట్లు

Wednesday 31st July 2019

న్యూఢిల్లీ: ఆంధ్ర సిమెంట్స్ నికర నష్టం ఏడాది ప్రాతిపదికన మరింత పెరిగింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.36.94 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది క్యూ1లో కంపెనీ నికర నష్టం రూ.31.34 కోట్లు. ఇక అంతక్రితం ఏడాదిలో రూ.93.24 కోట్లుగా ఉన్న ఆదాయం.. తాజా క్వార్టర్‌లో 55.80 శాతం క్షీణించి రూ.41.21 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయం 37.23 శాతం తగ్గింది. రూ.124.74 కోట్ల నుంచి రూ.78.29 కోట్లకు తగ్గింది.

కొత్త ఫైనాన్స్‌ సెక్రటరీగా రాజీవ్‌ కుమార్‌

Wednesday 31st July 2019

న్యూఢిల్లీ: ఆర్థిక సేవల కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్‌ కుమార్‌ మంగళవారం కొత్త ఫైనాన్స్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (ఏసీసీ) ఈ నియామకానికి ఆమోదముద్ర వేసినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. కుమార్‌ 1984 జార్ఖండ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. కుమార్‌కు బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు, మూలధన కల్పన వంటి అంశాల్లో అపార అనుభవం ఉంది.  సుభాష్‌ చంద్ర గార్గ్‌ను

Most from this category