News


జనవరి నుంచి హీరో బైక్స్‌ ధరల పెంపు

Tuesday 10th December 2019
news_main1575948941.png-30140

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ జనవరి నుంచి మోటార్‌ సైకిల్స్, స్కూటర్ల ధరలను రూ.2 వేల వరకు పెంచనుంది. ప్రస్తుతం హీరో కార్ప్‌ వాహనాల ధరల శ్రేణి రూ.39 వేల నుంచి రూ.1.05 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇప్పటికే మారుతీ సుజుకీ ఇండియా, టొయోటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మెర్సిడెస్‌ బెంజ్‌ కార్ల కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే. 



You may be interested

మిల్లుకు షుగరొచ్చింది!!

Tuesday 10th December 2019

భారీగా పేరుకుపోతున్న చక్కెర నిల్వలు ఇప్పటికే గోదాముల్లో 140 లక్షల టన్నులు దీనికి తోడవనున్న తాజా 268 లక్షల టన్నులు డిమాండ్‌ను మించిపోయిన సరఫరా నష్టాల్లో కంపెనీలు; కొన్ని మూసివేత! హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వినియోగాన్ని ఉత్పత్తి మించిపోవటంతో దేశంలో చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది అక్టోబరు 1 నాటికి భారత్‌లో 140 లక్షల టన్నుల చక్కెర నిల్వలున్నాయి. 2019 అక్టోబరు - 2020 సెప్టెంబరులో (ప్రస్తుత సీజన్లో) 268.5 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి

తగ్గిన ఎస్‌బీఐ రుణ రేటు

Tuesday 10th December 2019

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)... ఏడాది కాల వ్యవధి ఉండే రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటు 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించినట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ తగ్గడం ఇది వరుసగా ఎనిమిదవసారి.

Most from this category