News


విద్యుత్ వాహనాలకు ఊతం

Saturday 4th January 2020
news_main1578109135.png-30657

  • ఫేమ్‌-2 కింద 2,636 చార్జింగ్ స్టేషన్లకు అనుమతులు
  • తెలంగాణలో 138, ఏపీలో 266 ఏర్పాటు
  • కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ ఇండియా స్కీమ్ రెండో విడతలో భాగంగా 2,636 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. 24 రాష్ట్రాల్లోని 62 నగరాల్లో ఇవి ఏర్పాటు కానున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ వెల్లడించారు. ఆయా నగరాల్లో సుమారు 4 కిలోమీటర్ల దూరానికి ఒకటి చొప్పున చార్జింగ్ స్టేషన్‌ అందుబాటులోకి రాగలదని ఆయన వివరించారు. చార్జింగ్‌పరమైన మౌలిక సదుపాయాల సమస్య తీరనుండటంతో వాహనదారులకు ఊరట లభించడంతో పాటు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి తయారీ సంస్థలకు కూడా తోడ్పాటు లభించగలదని మంత్రి చెప్పారు. 
    ఫేమ్ ఇండియా స్కీమ్‌ రెండో విడత కింద ప్రకటించిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్‌లో 266, తెలంగాణలో 138 చార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 317 చార్జింగ్ స్టేషన్లు మంజూరయ్యాయి. స్థల సేకరణ, అవగాహన పత్రాలు కుదుర్చుకోవడం తదితర అంశాలు పూర్తయ్యాక.. స్టేషన్లు ఏర్పాటు చేసే సంస్థలకు అనుమతిపత్రాలు లభిస్తాయి. దాదాపు 7,000 పైచిలుకు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. వీటిలో 2,636 స్టేషన్లకు అనుమతి లభించింది. ఇందులో 1,633 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు .. 1,003 స్లో చార్జింగ్ స్టేషన్లు ఉండనున్నాయి. 



You may be interested

కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా

Saturday 4th January 2020

75 శాతం వాటా కొనుగోలు డీల్‌ విలువ రూ.5,520 కోట్లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో అతిపెద్ద మల్టీపోర్ట్‌ ఆపరేటర్‌ అయిన అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌.. కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో (కేపీసీఎల్‌) 75 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. డీల్‌ విలువ రూ.5,520 కోట్లు. కేపీసీఎల్‌ను ప్రమోట్‌ చేస్తున్న సీవీఆర్‌ గ్రూప్‌ నుంచి ఈ వాటాను దక్కించుకుంటోంది. కేపీసీఎల్‌ను రూ.13,572 కోట్లుగా

మ్యూచువల్‌ ఫండ్స్‌ వర్గీకరణల్లో యాంఫి మార్పులు

Saturday 4th January 2020

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ ‘యాంఫి’ అర్ధ సంవత్సర స్టాక్స్‌ జాబితాను విడుదల చేసింది. సెబీ, స్టాక్‌ ఎక్సేంజ్‌లతో సంప్రదించిన అనంతరం స్టా‍క్స్‌తో జాబితాను రూపొందించినట్టు యాంఫి తెలిపింది. లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీలను వాటి మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించే విషయంలో సెబీ 2017లో మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ఆధారంగా స్టాక్స్‌తో కూడిన జాబితాను యాంఫి రూపొందించి విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా జాబితాలో పలు స్టాక్స్‌

Most from this category