News


హీరో లెక్ట్రో... కొత్త ఈ-సైకిల్‌

Wednesday 16th October 2019
Markets_main1571197498.png-28908

  • టౌన్‌మాస్టర్‌@ రూ.30,999
  • 3 గంటలు చార్జింగ్‌...30-40 కి.మీ. ప్రయాణం

న్యూఢిల్లీ: హీరో సైకిల్స్‌కు చెందిన లెక్ట్రో ఈ-మొబిలిటీ సొల్యూషన్స్‌ కొత్త ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. టౌన్‌మాస్టర్‌ పేరుతో అందిస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్‌ సైకిల్‌ ధర రూ.30,999 అని లెక్ట్రో ఈ-మొబిలిటీ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ అదిత్య ముంజాల్‌ పేర్కొన్నారు.  ఈ బైక్‌ను చార్జింగ్‌ చేయడానికి ప్రత్యేకంగా చార్జింగ్‌ స్టేషన్లు అవసరం లేదని, సాధారణ ప్లగ్‌తోనే చార్జింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు. మూడు గంటలు చార్జింగ్‌ చేస్తే 30-40 కిమీ. దూరం ప్రయాణిస్తుందని వివరించారు.  ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే, పర్యావరణ స్పృహ గల కొత్త తరం వినియోగదారులు భారత్‌లో పెరుగుతున్నారని, ప్రత్యామ్నాయ రవాణా సాధనాల కోసం వీరు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లో డిజైన్‌ చేసిన ఈ సైకిల్‌లో డబుల్‌ డిస్క్‌ బ్రేక్‌లు, పంక్చర్‌ను తట్టుకునే టైర్లు వంటి ప్రత్యేకతలు‍న్నాయని తెలిపారు. 



You may be interested

టెల్కోల చార్జీలకు రెక్కలు!

Wednesday 16th October 2019

 ప్రస్తుత రేట్లు గిట్టుబాటు కావంటున్న కంపెనీలు టారిఫ్ పెరిగితే తప్ప కష్టం ఎయిర్‌టెల్‌ ఎండీ విఠల్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రిలయన్స్ జియో చార్జీలు అమలు చేస్తున్న నేపథ్యంలో మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంపు రాగాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కుకోవడం కష్టమేనంటూ తాజాగా భారతీ ఎయిర్‌టెల్ వ్యాఖ్యానించింది. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో (భారత్‌, దక్షిణాసియా విభాగం) గోపాల్

భారత్‌లో తొలి 5జీ లైవ్‌ వీడియో కాల్‌

Wednesday 16th October 2019

భారత్‌లో తొలి 5జీ లైవ్‌ వీడియో కాల్‌ క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో ప్రదర్శించిన ఎరిక్సన్‌ న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్‌ 5జీ లైవ్‌ వీడియో కాల్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రదర్శించింది. ఇది భారత్‌లో తొలి 5జీ వీడియో కాల్‌ అని, క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్‌ హెడ్‌(సౌత్‌ ఈస్ట్‌ ఏషియా, ఓషియానియా, ఇండియా) నున్‌జో మిర్టిల్లో చెప్పారు. 5జీ సర్వీస్‌లు మిల్లీమీటర్‌వేవ్‌(ఎమ్‌ఎమ్‌వేవ్‌-28 గిగా హెట్జ్‌, 38 గిగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ బాండ్స్‌)

Most from this category