News


ఆ లక్ష్యానికి మరో రెండేళ్లు ఆలస్యం:హెరిటేజ్‌

Friday 21st June 2019
news_main1561099389.png-26472

హైదరాబాద్‌: డెయిరీ కంపెనీ హెరిటేజ్‌ నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి మరో రెండేళ్లు ఆలస్యం కానుంది. 2022 నాటికి రూ.6,000 కోట్ల టర్నోవర్‌ స్థాయికి చేరుకుంటామని గతంలో కంపెనీ వెల్లడించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది 2024 అవుతుందని తెలిపింది. ‘సరఫరా అధికం కావడంతో పాల సేకరణ ధర తగ్గింది. దీంతో కొన్ని మార్కెట్లలో పాలు, పాల ఉత్పత్తుల ధర తగ్గించాల్సి వచ్చింది. ఈ కారణంగా వృద్ధి మందగించింది. ప్రస్తుతం పరిస్థితి మారింది. పాల పొడి నిల్వలు దాదాపుగా ఎగుమతి చేశాం’ అని కంపెనీ ఎండీ ఎం.సాంబశివ రావు తెలిపారు. 2018-19లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన కంపెనీ టర్నోవర్‌ 6 శాతం వృద్ధితో రూ.2,515 కోట్లు నమోదు చేసింది.



You may be interested

11900 వద్ద నిఫ్టీకి నిరోధం

Friday 21st June 2019

నిఫ్టీ శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు అరశాతం నష్టంలో ఉంది. గురువారం అనూహ్య అప్‌మూవ్‌ చూపిన సూచీలు డైలీ చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ పాటర్న్‌ ఏర్పరిచాయి. నిఫ్టీ కీలక 50 రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొంది పైకి ఎగిసింది. ఇకపై 11680 పాయింట్లు(50 రోజుల డీఎంఏ) కీలకం కానుంది. తాజా అప్‌మూవ్‌లోమరోమారు నిఫ్టీ తన స్వల్పకాల ట్రేడింగ్‌ జోన్‌ పై అవధిని తాకవచ్చు. ఈ స్థాయి 11900- 11980 పాయింట్ల

ఈబీ5 పెట్టుబడులతో అమెరికాలో ప్రయోజనాలు

Friday 21st June 2019

- అక్టోబర్‌ నుంచి పెరగనున్న పెట్టుబడుల పరిమితి - ఎంసీఎఫ్‌ఐ ఇండియా డైరెక్టర్‌ వివేక్‌ రావు హైదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: అమెరికాలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అక్కడ స్థానికత్వ ప్రయోజనాలు పొందడానికి ఉపయోగపడే ప్రస్తుత ఈబీ5 విధానం గడువు త్వరలో ముగిసిపోనుందని మేరీల్యాండ్‌ సెంటర్‌ ఫర్‌ ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఎంసీఎఫ్‌ఐ) ఇండియా డైరెక్టర్‌ వివేక్‌ రావు తెలిపారు. ప్రస్తుత విధానం కింద 5 లక్షల డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ సరిపోతుందని కొత్తగా అక్టోబర్‌ నుంచి

Most from this category