STOCKS

News


సగానికి పడిపోయిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం

Friday 31st January 2020
news_main1580445191.png-31361

హైదరాబాద్‌: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం సగానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3 కన్సాలిడేషన్‌ ఫలితాల్లో రూ.11 కోట్ల లాభాన్ని ఆర్జించగా.. గత ఆర్థికం ఇదే కాలంలో లాభం రూ.20 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం మాత్రం గతేడాది క్యూ3లో రూ.674 కోట్ల నుంచి ఈ క్యూ3 నాటికి రూ.727 కోట్లకు పెరిగింది. ఎబిటా రూ.34.12 కోట్లుగా ఉంది. పర్యావరణ సవాళ్లు ఉన్నప్పటికీ తొమ్మిది నెలల ఆదాయంలో రెండంకెల వృద్ధిని, పాలు, పశువుల దాణా ఉత్పత్తుల్లో గణణీయమైన వృద్ధిని నమోదు చేశామని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మిణి తెలిపారు. విలువ ఆధారిత ఉత్పత్తుల జోడింపుతో రానున్న త్రైమాసికాల్లో నిర్వహణ మార్జిన్లలో వృద్ధిని సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 



You may be interested

పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ విలీనానికి బ్రేక్‌

Friday 31st January 2020

న్యూఢిల్లీ: ఆర్థిక సంస్థలైన ఆర్‌ఈసీ లిమిటెడ్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ప్రతిపాదిత విలీనానికి బ్రేక్‌ పడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలు అడ్డంకి కావడంతో విలీనం ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్టేనని సమాచారం. ఏదేని ప్రాజెక్టులో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ రుణం 25 శాతానికి మించొద్దు. కొన్ని ప్రాజెక్టులకు ఈ రెండు కంపెనీలు ఇప్పటికే రుణం మంజూరు చేసి ఉన్నాయి. ఇరు సంస్థలు విలీనమైతే ఈ రుణ పరిమితి 25

ఎల్‌ఐసీ హౌసింగ్‌పై కేటాయింపుల ప్రభావం

Friday 31st January 2020

రూ.602 కోట్లకు తగ్గిన నికర లాభం  నికర వడ్డీ ఆదాయం 18 శాతం అప్‌ ముంబై: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో స్వల్పంగా తగ్గంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.607 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌)ఈ క్యూ3లో రూ.602 కోట్లకు తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ సిద్ధారథ మొహంతి తెలిపారు.  మొత్తం ఆదాయం రూ.4,466 కోట్ల నుంచి

Most from this category