News


ఇన్ఫీ ఫలితాలు.. ఏం చూడాలి?

Thursday 9th January 2020
news_main1578563884.png-30805

మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌ను శుక్రవారం ఇన్ఫోసిస్‌ ఆరంభించనుంది. సాధారణంగా క్యు3లో ఐటీ కంపెనీల ఫలితాలు నీరసంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి...
- రూపీ లెక్కల్లో కంపెనీ ప్రాఫిట్‌ వృద్ధి గత త్రైమాసికంతో పోలిస్తే 6-8 శాతం, గతేడాదితో పోలిస్తే 4-7 శాతం ఉండొచ్చు.
- స్థిర కరెన్సీ లెక్కల్లో విక్రయాలు 1.4- 2 శాతం పెరుగుదల చూపవచ్చు. 
- క్యు2తో పోలిస్తే మార్జిన్లు 40- 50 శాతం విస్తరించవచ్చు. 
- కంపెనీ రెవెన్యూ గైడెన్స్‌ను రివైజ్‌ చేయవచ్చన్న అంచనాలున్నాయి. 
- బలహీన రూపాయి కారణంగా కంపెనీ ఫలితాలు బాగుంటాయని ఎక్కువమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 
- పౌండ్‌ బలపడినా, యూరో బలహీనత వల్ల రెండిటి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.
- బలమైన డీల్స్‌ గెలుచుచుకున్నట్లు కంపెనీ ప్రకటించవచ్చు. 
- బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో వృద్ది, అట్రిషన్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలను నిశితంగా పరిశీలించాలి.
- వివిధ అంశాలపై కంపెనీ మేనేజ్‌మెంట్‌ వ్యాఖ్యానం కీలకమని నిపుణుల అంచనా. 



You may be interested

సెన్సెక్స్‌.. హైజంప్‌...635 పాయింట్లు అప్‌

Thursday 9th January 2020

నిఫ్టీ లాభాల డబుల్‌ సెంచరీ రియల్టీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ జూమ్‌ ఐటీ ఇండెక్స్‌ వెనకడుగు చిన్న షేర్లకు భారీ డిమాండ్‌ గత గురువారం తలెత్తిన ఉద్రిక్త వాతావరణం ఈ గురువారానికల్లా తేలిపోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లకు ఒక్కసారిగా హుషారొచ్చింది. అటు అమెరికా.. ఇటు ఇరాన్‌ ప్రత్యక్ష దాడులకు దిగబోమంటూ సంకేతాలు ఇవ్వడంతో ఒక్కసారిగా సెంటిమెంటు బలపడింది. ఫలితంగా ముడిచమురు, బంగారం ధరలు దిగివచ్చాయి. దీంతో రూపాయి జోరందుకుంది. ఈ అన్ని అంశాలూ దేశీయంగా ఇన్వెస్టర్లకు

అగ్రి కెమ్‌, ఫెర్టిలైజర్‌ షేర్ల దూకుడు

Thursday 9th January 2020

జాబితాలో ఫ్యాక్ట్‌, జీఎస్‌ఎఫ్‌సీ రామా ఫాస్ఫేట్స్‌, మంగళూర్‌ కెమ్‌ ఏరీస్‌ ఆగ్రో, ఆర్‌సీఎఫ్‌, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ 7-2 శాతం మధ్య హైజంప్‌ ఈ రబీ సీజన్‌(2019-20)లో పంటల విస్తీర్ణం పెరగడటం, ఇన్‌పుట్‌ వినియోగం పుంజుకోవడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో వ్యవసాయ రంగ కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్‌ పెరిగింది. ఇన్వె‍స్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రధానంగా ఫెర్టిలైజర్‌, అగ్రి కెమికల్‌ కంపెనీల కౌంటర్లు లాభాల దూకుడు చూపుతున్నాయి. సకాల వర్షాలు, నీటి లభ్యత పెరగడం వంటి పరిస్థితుల కారణంగా

Most from this category