News


గృహరుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ రేట్ల తగ్గింపు

Saturday 4th January 2020
Markets_main1578129152.png-30676

ప్రైవేటు రంగ రుణ దిగ్గజ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించేసింది. కొత్త కస్టమర్లను పొందేందుకు, ప్రస్తుత కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ లోన్స్‌పై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు తగ్గింపుతో అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. ఈ తగ్గింపు నిర్ణయం జనవరి 6 నుంచి అమలులోకి వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో పేర్కోంది. ఈ తాజా రేట్ల తగ్గింపు నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.2 శాతం నుంచి ప్రారంభం అవుతోందని 9 శాతం వరకు కూడా ఉంది. ఆర్‌బీఐ డిసెంబర్‌లో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో బెంచ్ మార్క్ రెపో రేటును యథాతధంగా ఉంచినప్పటికీ ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను తగ్గించాయి. ఈ వారం ప్రారంభంలో ఎస్‌బీఐ తన బెంచ్‌మార్క్ లెండింగ్ రేటులో ఏకంగా 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేటు 7.8 శాతానికి దిగొచ్చింది. 



You may be interested

నెల రోజులకు మూడు సిఫార్సులు

Saturday 4th January 2020

వచ్చే మూడు నాలుగు వారాల్లో మంచి రాబడిని అందించే మూడు స్టాకులను ఇండియానివేశ్‌ సెక్యూరిటీస్‌ అందిస్తోంది. 1. ఎంఅండ్‌ఎం: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 560. స్టాప్‌లాస్‌ రూ. 524. కొన్ని నెలలుగా ఈ షేరు రూ. 510 చుట్టూ తిరుగుతోంది. గతంలో ఈ స్థాయి షేరుకు బలమైన డిమాండ్‌ జోన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ జోన్‌ వద్ద డబుల్‌ బాటమ్‌ కూడా ఏర్పడింది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ సంకేతాలు ఇస్తోంది.  2. వేదాంత: కొనొచ్చు.

టెన్షన్లున్నా మార్కెట్లు ముందుకే!

Saturday 4th January 2020

2020లో దేశీ మార్కెట్లపై అంచనాలు ఉమేష్‌ మెహతా, శామ్‌కో సెక్యూరిటీస్‌ అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక ఆందోళనలున్నప్పటికీ ఈ ఏడాది(2020)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల పరుగు తీయనున్నట్లు విశ్లేషకులు ఉమేష్‌ మెహతా అంచనా వేస్తున్నారు. టెన్షన్లు ఉన్నప్పటికీ గతేడాదితో పోలిస్తే మార్కెట్లు మంచి రిటర్నులు అందించే వీలున్నట్లు పేర్కొన్నారు. శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిన ఇతర అభిప్రాయాలు చూద్దాం..  ఇటీవల ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ సరికొత్త గరిష్టానికి

Most from this category