News


హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 61శాతం అప్‌

Monday 4th November 2019
news_main1572861513.png-29336

రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మంచి ఫ‌లితాల‌ను క‌న‌బ‌రిచింది. మోర్ట్‌గేజ్ రుణాలు అందించే ఈ ప్రైవేట్‌రంగ దిగ్గజం ఈ క్యూ2లో రూ. 3,961.53 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది.  గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన రూ.2,467.08 కోట్లతో పోలిస్తే ఇది 60.57శాతం అధికం. ఇదే క్యూ2లో నిర్వహణ ఆదాయం 10శాతం వృద్ధి చెంది రూ.10,478.33 కోట్లను సాధించింది. గతేడాది క్యూ2లో రూ.9,494.70 కోట్లుగా నమోదైంది. ఈ క్వార్టర్‌లో నికర వడ్డీ మార్జిన్‌ 3.3శాతంగా ఉంది. రుణ వృద్ధి 12శాతం జరిగింది. నికర వడ్డీ ఆదాయం గతేడాది క్యూ2లో సాధించిన రూ.2,594 కోట్లతో పోలిస్తే 16.5శాతం పెరిగి రూ.3,021 కోట్లను ఆర్జించింది. ఇక ఇదే కాలంలో మొండి బకాయిలకు రూ.754 కోట్ల ప్రోవిజన్లు కేటాయించింది. కాగా గతేడాది క్యూ2లో రూ.890 కోట్లను కేటాయించింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల ఎన్‌పీఏలు 1.29శాతం నుంచి 1.33శాతానికి పెరిగాయి. జూన్‌ క్వార్టర్‌లో రూ.5,315 కోట్లు నమోదు కాగా, ఈ క్వార్టర్‌ నాటికి రూ.5,655 కోట్లకు పెరిగాయి. ఇదే క్వార్టర్‌లో పన్ను వ్యయం రూ.568 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే క్యూ2లో రూ.1,022 కోట్లుగా నమోదైంది. సగటు రుణ పరిమాణం విలువ తగ్గినట్లు బ్యాంక్ తెలిపింది. రుణాలలో 76 శాతం వాటా వ్యక్తిగతమైనవేనంటూ కంపెనీ తెలియజేసింది. వ్యక్తిగత రుణాలలో 17 శాతం పురోగతిని సాధించినట్లు తెలియజేసింది. 
క్యూ2లో కంపెనీ ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించడంతో కంపెనీ షేరు మధ్యాహ్నం గం.3:10లకు 2.29శాతం లాభంతో రూ.2177.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

సెన్సెక్స్‌ రికార్డు ముగింపు

Monday 4th November 2019

రాణించిన మెటల్‌, ఐటీ షేర్లు కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్‌ ఏడోరోజూ లాభంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, ఇప్పటి వరకు కంపెనీలు వెల్లడించిన రెండో క్వార్టర్‌ ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడం తదితర కారణాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీ షేర్ల ర్యాలీ

మీడియం టెర్మ్‌ కోసం స్టాక్‌ సిఫార్సులు

Monday 4th November 2019

పటిష్టమైన అప్‌ట్రెండ్‌లో వున్న ప్రస్తుత మార్కెట్లో మధ్య కాలానికి రాబడుల్ని ఇవ్వగలిగే షేర్లను వివిధ విశ్లేషకులు సూచించారు. అవి.... విశ్లేషకులు: ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌ అండ్‌ సెక్యురిటీస్‌     కోటక్‌ మహింద్రా బ్యాంక్‌: కొనచ్చు; తాజా ధర: రూ. 1,578; టార్గెట్‌ ధర: రూ. 1,871; అప్‌సైడ్‌: 18 శాతం; కాలవ్యవధి: 9-12 నెలలు కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ వారపు చార్టులలో 2017 జనవరిలో ఏర్పరిచిన స్థాయి రూ. 692 నుంచి జూన్‌ 2018 ఏర్పరిచిన స్థాయి

Most from this category