News


హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.3,203 కోట్లు

Saturday 3rd August 2019
news_main1564809162.png-27516

  • 46 శాతం వృద్ధి 
  •  రూ.12,996 కోట్లకు మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ. 3,204 కోట్ల నికర లాభం(స్టాండ్‌అలోన్‌) సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం, రూ.2,190 కోట్లుతో పోల్చితే 46 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,952 కోట్ల నుంచి రూ.12,996 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.2,190 కోట్ల నుంచి 43 శాతం ఎగసి రూ.3,130 కోట్లకు చేరిందని తెలిపింది. నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎమ్‌)లో ఎలాంటి మార్పు లేదని, 3.3 శాతంగా నమోదైందని వివరించింది. నిర్వహణ లాభం రూ.10,187 కోట్ల నుంచి  14 శాతం వృద్ధితో రూ.11,573 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

రూ.45,000 కోట్ల సమీకరణ...
రుణలు 11 శాతం వృద్ధితో రూ.4.16 లక్షల కోట్లకు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 1.22 శాతం నుంచి 1.29 శాతానికి పెరిగాయని పేర్కొంది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన సెక్యూర్డ్‌, రిడీమబుల్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.45,000 కోట్లు సమీకరించనున్నామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని పేర్కొంది. 



You may be interested

ద్విచక్ర వాహన విక్రయాల్లో రెండంకెల క్షీణత

Saturday 3rd August 2019

ప్రముఖ దేశీ ద్విచక్ర వాహన కంపెనీల అమ్మకాలు జూలైనెలలో గణనీయంగా పడిపోయాయి. గతనెల్లో 5,35,810 యూనిట్లను విక్రయించిన హీరో మోటోకార్ప్‌.. ఏడాది ప్రాతిపదికన ఏకంగా 21.18 శాతం తగ్గుదలను నమోదుచేసింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు 27 శాతం తగ్గిపోయాయి. ఈ సంస్థ దేశీ విక్రయాలు 49,182 యూనిట్లు కాగా, బజాజ్‌ ఆటో అమ్మకాల్లో 13 శాతం, టీవీఎస్‌ మోటార్‌ విక్రయాల్లో 16 శాతం తగ్గుదల నమోదైంది. మరోవైపు తాజాగా వెల్లడైన

ప్రభుత్వ బ్యాంకుల నియమావళిని నవీకరించిన ఆర్బీఐ

Saturday 3rd August 2019

పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు లేదా మునిసిపల్ కార్పొరేషన్ల వంటి స్థానిక సంస్థలలోని సభ్యులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డులలో ఉండకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నవీకరించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రమాణాలలో పేర్కొంది. వీరితో పాటు ఏ ప్రభుత్వ రంగ బ్యాంకులోనైన చట్టబద్దమైన సెంట్రల్ ఆడిటర్లుగా పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థల భాగస్వాములు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డులలో చేరడానికి అనర్హులని వివరించింది. ఈ

Most from this category