News


హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.4,196 కోట్లు

Tuesday 28th January 2020
news_main1580180176.png-31247

  • 24 శాతం వృద్ధి 
  • 5 లక్షల కోట్లకు ఎగసిన రుణాలు 
  • నాలుగు రెట్లు ఎగసిన స్టాండ్‌అలోన్‌ లాభం 

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.3,377 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.4,196 కోట్లకు పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.24,653 కోట్ల నుంచి రూ.29,073 కోట్లకు పెరిగిందని కంపెనీ వైస్‌ చైర్మన్‌, సీఈఓ కేకి మిస్త్రీ వెల్లడించారు. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం నాలుగు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.2,114 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.8,372 కోట్లకు ఎగసిందని తెలిపారు.  గృహ్‌ ఫైనాన్స్‌లో 9.9 శాతం వాటాకు సమానమైన 15.9 కోట్ల షేర్లను బంధన్‌ బ్యాంక్‌కు కేటాయించిన కారణంగా రూ.9,020 కోట్ల లాభాన్ని సాధించింది. ఇది నోషనల్‌ (భావాత్మక) లాభమేనని, కానీ ఖాతా పుస్తకాల పరంగా లెక్కల్లో చెప్పడం తప్పనిసరి అని వివరించారు. రుణాలు తొలిసారిగా రూ.5 లక్షల కోట్ల మైలురాయిని దాటాయని మిస్త్రీ వెల్లడించారు. మరిన్ని వివరాలు.....
నికర వడ్డీ మార్జిన్‌ 3.3 శాతం 
స్టాండ్‌అలోన్‌ పరంగా ఆదాయం రూ.10.582 కోట్ల నుంచి రూ.20,291 కోట్లకు పెరిగింది. వ్యక్తిగత రుణాలు 24 శాతం ఎగిశాయి. గత రెండు క్వార్టర్లోల ఉన్నట్లుగానే నికర వడ్డీ మార్జిన్‌ 3.3 శాతంగా నమోదైంది. మార్కెట్లో ప్రతికూల పరిస్థితులున్నా, ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉన్నా, స్థూల మొండి బకాయిలు 1.36 శాతం(రూ.5,950 కోట్లు) రేంజ్‌లోనే ఉన్నాయి. వ్యక్తిగత రుణాలకు సంబంధించిన మొండి బకాయిలు మాత్రం 2 బేసిస్‌ పాయింట్లు పెరిగి 0.75 శాతానికి చేరాయి. సగటున నెలకు 9,400 గృహ రుణాలను మంజూరు చేస్తోంది. నిబంధనల ప్రకారం రూ.3,624 కోట్ల కేటాయింపులు ఉండాల్సి ఉండగా, రూ.9,934 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. 

 కాగా  ఈ సంస్థ రుణ వృద్ధి 19 శాతం రేంజ్‌లో కొనసాగగలదని ఎంకే గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. 



You may be interested

దిగుమతి సుంకాలు తగ్గించాలి..

Tuesday 28th January 2020

పసిడి.. వజ్రాభరణాల పరిశ్రమ డిమాండ్‌ భారత్‌ ఏటా 800–900 టన్నుల పసిడి దిగుమతి చేసుకుంటోంది. 2018–19లో పసిడి దిగుమతులు 22.16 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. భారీగా పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటును కట్టడి చేసే దిశగా పసిడిపై విధించిన సుంకాలతో.. దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో 7 శాతం క్షీణించి 20.57 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో వజ్రాభరణాల దిగుమతులు కూడా

మారుతీ కార్ల ధరలు పెరిగాయ్‌

Tuesday 28th January 2020

మోడల్‌ ఆధారంగా రూ. 10,000 వరకు పెంపు న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వాహన ధరలను పెంచినట్లు సోమవారం ప్రకటించింది. మోడల్‌ ఆధారంగా రూ. 10,000 వరకు పెంచింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించడంలో భాగంగా పలు మోడళ్ల ధరలను పెంచుతున్నామని, ఈ పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గరిష్టంగా 4.7 వరకు పెంపు

Most from this category