News


టాటా, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ల పోటాపోటీ

Friday 28th December 2018
news_main1545984558.png-23287

వాల్యూషన్లలో పోటీ పడుతున్న టాప్‌ బిజినెస్‌ గ్రూప్‌లు 
భారత్‌లో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థానం కోసం హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌, టాటా గ్రూప్‌లు పోటీ పడుతున్నాయి. ఒకరోజు ట్రేడింగ్‌ చివరకు టాటా గ్రూప్‌ వాల్యూషన్‌ పరంగా టాప్‌టో ఉంటే మరోరోజు హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ ముందుంటోంది. బుధవారం ట్రేడింగ్‌ చివరకు టాప్‌ కార్పొరేట్‌ గ్రూప్‌గా ఉన్న టాటా గ్రూప్‌ను తోసిరాజని హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ అగ్రస్ధానానికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌లోని ఐదు కంపెనీల ఉమ్మడి విలువ బుధవారం క్లోజింగ్‌ సమయానికి 10. 40 లక్షల కోట్ల రూపాయలుండగా, టాటా గ్రూప్‌లోని 25 కంపెనీల ఉమ్మడి విలువ 10.38 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. తిరిగి గురువారం క్లోజింగ్‌లో టాటా గ్రూప్‌ విలువ 10.45 లక్షల కోట్ల రూపాయలకు చేరగా, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ విలువ 10. 44 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. 


ఈ ఏడాది హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు దాదాపు 13 శాతం లాభపడ్డాయి. తాజాగా లిస్టయిన హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలు గ్రూప్‌ విలువ పెంచాయి.

టాటా గ్రూప్‌లో టీసీఎస్‌ ఈ సంవత్సరం 42 శాతం లాభపడింది. అయితే ఇదే గ్రూప్‌లోని టాటా మోటర్స్‌ 60 శాతం, టాటా స్టీల్‌ 25 శాతం పతనం అయ్యాయి. దీంతో గ్రూప్‌ విలువ భారీగా పెరగలేదు. ఇవి కాకుండా టాటా గ్రూప్‌లో పలు కంపెనీలున్నప్పటికీ, వాటి మార్కెట్‌ క్యాప్‌ చాలా తక్కువ. 



You may be interested

ఫార్మా షేర్లకు‘‘సన్‌ ఫార్మా’’ అండ

Friday 28th December 2018

4శాతం లాభపడ్డ సన్‌ఫార్మా షేర్లు ముంబై:- సన్‌ ఫార్మా షేర్ల ర్యాలీ అండతో శుక్రవారం ఫార్మా షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పార్మా ఇండెక్స్‌ 2శాతానికి పైగా లాభపడింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 8,700.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇండెక్స్‌ 2శాతం లాభపడి 8830.10 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30లకు ఇండెక్స్‌ గతముగింపు (8,665.75)తో పోలిస్తే 1.75శాతం లాభపడి

బ్యాంకింగ్‌ షేర్ల జోరు

Friday 28th December 2018

కేంద్రం 7 ప్రభుత్వ రంగ బ్యాంకుల‌కు రూ.28615 కోట్ల మూల‌ధ‌నం సమకూరుస్తున్నట్లు ప్రక‌టించ‌డంతో పాటు అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో శుక్రవారం బ్యాంకింగ్ రంగ షేర్లు పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతం, ప్రై‍్రవేట్‌ రంగ ఇండెక్స్‌, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం చొప్పున ర్యాలీ చేశాయి. ద్రవ్య కొరతను ఎదుర్కొంటున్న ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ డిసెంబర్‌ 31లోగా

Most from this category