STOCKS

News


బకాయిలేమీ లేవు: హెచ్‌డీఎఫ్‌సీ

Wednesday 31st July 2019
news_main1564546155.png-27427

సిద్దార్థతో సంబంధం ఉన్న కంపెనీల నుంచి తమకు రుణ బాకాయిలు ఉన్నట్లు వచ్చిన వార్తలను హెచ్‌డీఎఫ్‌సీ తోసిపుచ్చింది. ‘సీసీడీకి చెందిన టాంగ్లిన్‌ డెవలప్‌మెంట్స్‌ బెంగళూరులోని గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌పార్క్‌ ప్రాజెక్టు కోసం గతంలో మేం రుణాలిచ్చాం. అయితే, 2019 జనవరిలో ఈ మొత్తం రుణాన్ని సంబంధిత సంస్థ చెల్లించేసింది. ప్రస్తుతం కాఫీడే ఎంటర్‌ ప్రైజెస్‌ గ్రూపు నుంచి మాకు ఎలాంటి బకాయిలూ లేవు’ అని హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.You may be interested

సీసీడీలో 6 శాతం వాటా ఉంది: కేకేఆర్‌

Wednesday 31st July 2019

సీసీడీ వ్యవస్థాపకుడు సిద్దార్థ అదృశ్యం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం కేకేఆర్‌ పేర్కొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేసింది. సిద్దార్థపైన నమ్మకంతో సీసీడీలో తాము తొమ్మిదేళ్ల క్రితం చేసిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని గతేడాది విక్రయించామని.. దీంతో తమ వాటా 10.3 శాతం నుంచి ప్రస్తుతం 6 శాతానికి పరిమితమైనట్లు కేకేఆర్‌ ఒక

బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్దార్థ అంగీకరించారు: ఐటీ శాఖ

Wednesday 31st July 2019

అదృశ్యమైన కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థను తాము గతంలో దర్యాప్తు సందర్భంగా వేధించామన్న ఆరోపణలను ఆదాయపు పన్ను శాఖ ఖండించింది. సోషల్‌ మీడియాలో వెలుగుచూసిన లేఖలోని సిద్దార్థ సంతకం, తమ దగ్గరున్న సంతకానికి చాలా తేడా ఉందని ఐటీ శాఖ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. గతంలో తాము జరిపిన సోదాల్లో తనవద్ద బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్దార్థ అంగీకరించారని కూడా ఐటీ శాఖ తెలిపింది. భారీ మొత్తంలో పన్ను

Most from this category