News


అపోలో మ్యునిక్‌ ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్‌

Friday 10th January 2020
news_main1578627751.png-30815

కొనుగోలును పూర్తి చేసిన హెచ్‌డీఎఫ్‌సీ
న్యూఢిల్లీ: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సేవల్లో ఉ‍న్న అపోలో మ్యునిక్‌ కొనుగోలును ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ పూర్తి చేసింది. ఈ సంస్థలో అపోలో హాస్పిటల్స్‌ గ్రూపునకు ఉన్న 50.80 శాతం వాటాను రూ.1,485 కోట్లకు, అలాగే, ఉద్యోగుల వద్దనున్న 0.36 శాతం వాటాను రూ.10.67 కోట్లకు కొనుగోలు చేసింది. అపోలో మ్యునిక్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు నియంత్రణ సంస్థల ఆమోదం లభించడంతో ఈ లావాదేవీని పూర్తి చేసింది. దీంతో అపోలో మ్యునిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ పేరును ‘హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌’గా మార్చినట్టు కంపెనీ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. హెచ్‌డీఎఫ్‌సీ సబ్సిడరీగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అజయ్‌ త్యాగిని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్‌ ఎండీ, సీఈవోగా నియమించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ విలీనానికి అనుమతి కోరుతూ త్వరలోనే ఎన్‌సీఎల్‌టీకి దరఖాస్తు చేయనున్నట్టు తెలిపింది. విలీనం అనంతరం ప్రమాద, ఆరోగ్య బీమా విభాగంలో దేశంలోనే రెండో అతిపెద్ద సంస్థగా అవతరిస్తుందని పేర్కొంది.
మరింత బలోపేతం అవుతుంది: శోభన కామినేని 
హెచ్‌డీఎఫ్‌సీ నిర్వహణలో అపోలో మ్యునిక్‌ మరింత బలమైన సంస్థగా మారుతుందన్న విశ్వాసాన్ని అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శోభన కామినేని వ్యక్తం చేశారు. ఆమె ఇప్పటి వరకు అపోలో మ్యునిక్‌కు చైర్‌పర్సన్‌గానూ వ్యవహరించారు. ‘‘ఆరోగ్య బీమాలో అపోలో మ్యునిక్‌ అనుభవానికి, మా బ్రాండ్‌ విలువను జోడించడం ద్వారా భాగస్వాములకు విలువను సృష్టించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. You may be interested

‘నార్డిక్‌’ దిశగా మన ఐటీ నావ!

Friday 10th January 2020

హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌లకు ఇప్పటికే నార్డిక్‌ దేశాల్లో కార్యకలాపాలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్న టెక్‌ మహీంద్రా, విప్రో ఇంగ్లిష్‌ భాషా పరంగా అనుకూలత, నిపుణుల లభ్యత కలిసొస్తున్న ప్రభుత్వ విధానాలు, ఇతర సానుకూలతలు న్యూఢిల్లీ: మన దేశ ఐటీ కంపెనీల చూపు నార్డిక్‌ దేశాల వైపు మళ్లింది. నార్డిక్‌ దేశాలుగా పిలిచే ఫిన్లాండ్‌, స్వీడన్‌, నార్వే, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌ల్లో ప్రముఖ ఐటీ కంపెనీలు కార్యాలయాలను తెరిచేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. యూరోప్‌లో ఈ దేశాలు ప్రధానంగా ఇంగ్లిష్‌ భాషా

టాటా-జీఐసీ నుంచి జీఎంఆర్‌కు రూ.2,000 కోట్ల రుణం

Friday 10th January 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.2,000 కోట్ల రుణం సమీకరించింది. టాటా సన్స్‌, సింగపూర్‌ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ నుంచి ఈ రుణాన్ని సేకరించినట్టు సమాచారం. ఇప్పటికే ఉన్న రుణాలను తగ్గించుకోవడానికి ఈ నిధులను వినియోగించనుంది. ప్రస్తుతం సంస్థకు రూ.20,000 కోట్లకుపైగా అప్పులున్నాయి. కాగా, హాంకాంగ్‌కు చెందిన ఈఎస్‌ఆర్‌ కేమాన్‌ అనుబంధ కంపెనీతో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఏరోట్రోపోలిస్‌ జేవీ

Most from this category