News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.6,638 కోట్లు

Monday 21st October 2019
news_main1571631129.png-29020

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.6,638 కోట్లు
  • 25 శాతం వృద్ధి 
  • రూ.36,131 కోట్లకు మొత్తం ఆదాయం 
  • స్వల్పంగా పెరిగిన మొండి బకాయిలు 


న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.6,638 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ. 5,322 కోట్లుతో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 15 శాతం పెరగడం, నికర వడ్డీ మార్జిన్‌ 4.2 శాతంగా ఉండటంతో ఈ రేంజ్‌ నికర లాభం సాధించామని వివరించింది. మొత్తం ఆదాయం రూ.30,124 కోట్ల నుంచి రూ.36,131 కోట్లకు ఎగసిందని తెలిపింది. రుణాలు రూ.7,95,563 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.9,47,440 కోట్లకు పెరిగాయని,  నికర వడ్డీ ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.13,515 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వివరించింది. ఇతర ఆదాయం 39 శాతం పెరిగి  రూ.5,589 కోట్లకు పెరిగింది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.5,006 కోట్లుగా ఉన్న నికర లాభం రూ.6,345 కోట్లకు పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.28,215 కోట్ల నుంచి 33,755 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

 తగ్గిన రుణ నాణ్యత...
మొండి బకాయిలు ఒకింత పెరగడంతో బ్యాంక్‌ రుణ్యత స్వల్పంగా తగ్గింది. గత క్యూ2లో రూ.10,098 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.12,508 కోట్లకు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడించింది. నికర మొండి బకాయిలు రూ.3,028 కోట్ల నుంచి రూ.3,791 కోట్లకు చేరాయని పేర్కొంది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 1.33 శాతం నుంచి 1.38 శాతానికి, నికర మొండి బకాయిలు 0.42 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగాయని తెలిపింది. మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు రూ.1,820 కోట్ల నుంచి  రూ.2,701 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం డిపాజిట్లు ఈ క్యూ2లో 23 శాతం వృద్ధితో రూ.10,21,615  కోట్లకు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. 



You may be interested

రాబడుల్లో మేటి పనితీరు

Monday 21st October 2019

-యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ -డి.జయంత్‌కుమార్‌, థర్డ్‌పార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌    ఈక్విటీ ఇన్వెస్టర్లకు గడిచిన ఏడాది, రెండేళ్లు పరీక్ష కాలం వంటిది. ఎన్నో అనిశ్చితులు, ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సూచీల్లో పెరుగుదల ఉన్నా కానీ, రిటైల్‌ ఇన్వెస్టర్లు రాబడులు పొందింది లేదు. కొందరు నష్టాలు కూడా చవిచూశారు. మార్కెట్‌ అంతటా పెరుగుదల లేకపోవడమే దీనికి కారణం. కేవలం కొన్ని కంపెనీలే మార్కెట్‌ పెరుగుదలకు దోహదపడ్డాయి. అందుకే అనిశ్చిత పరిస్థితుల్లో

ఎయిరిండియా విక్రయానికి త్వరలో బిడ్లు

Monday 21st October 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాల విక్రయానికి బిడ్లు ఆహ్వానించడంపై  కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణ పత్రానికి (ఈవోఐ) తుది మెరుగులు దిద్దుతోంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో గానీ ప్రాథమికంగా బిడ్లు ఆహ్వానించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఇప్పటికే కొన్ని సంస్థలు ఎయిరిండియాపై ఆసక్తి కూడా వ్యక్తీకరించినట్లు వివరించాయి. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ-బిడ్డింగ్

Most from this category