News


రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Wednesday 7th August 2019
news_main1565155782.png-27599

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రుణ రేటు 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గింది. అన్ని కాలపరిమితుల రుణ రేట్లు 0.10 శాతం తగ్గాయి.  తాజా నిర్ణయం బుధవారం నుంచీ అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రారంభమైన రెండవరోజు హెచ్‌డీఎఫ్‌సీ తాజా ప్రకటన చేయడం గమనార్హం. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.75 శాతం) తగ్గింపుపై బుధవారం నాడు ఆర్‌బీఐ కీలక ప్రకటన చేయనుంది. గడచిన మూడు ద్వైమాసిక పరపతి సమీక్ష సమావేశాల సందర్భంగా ఆర్‌బీఐ వరుసగా పావుశాతం చొప్పున మొత్తం  0.75 శాతం రేటు కోత నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐసహా పలు బ్యాంకులు గడచిన కొద్ది వారాల్లో తమ రుణ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. తాజా నిర్ణయం నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు) 8.60 శాతానికి తగ్గుతుంది. ఆటో, గృహ, వ్యక్తిగత రుణాలకు ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ ప్రమాణం కావడం గమనార్హం. 



You may be interested

టైటాన్‌ 3 శాతం డౌన్‌

Wednesday 7th August 2019

క్యూ1 ఫలితాలను టైటాన్‌ కంపెనీ మంగళవారం ప్రకటించిన తర్వాత పలు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు, ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను తగ్గించాయి. ఫలితంగా బుధవారం ట్రేడింగ్‌లో టైటాన్‌ కంపెనీ లి. షేరు విలువ ఉదయం 11.04 సమయానికి 3.55 శాతం నష్టపోయి రూ. 1,009.50 వద్ద ట్రేడవుతోంది. కాగా గత సెషన్లో ఈ కంపెనీ షేరు 0.5 శాతం లాభపడి రూ. 1,042.00 వద్ద ముగిసింది.  టైటాన్‌ క్యూ 1 ఫలితాలు:

1.2 లక్షల స్టోర్లలో ‘పైన్‌ల్యాబ్స్‌’ క్రెడిట్‌, డెబిట్‌ ఈఎంఐ

Wednesday 7th August 2019

హైదరాబాద్‌: మర్చంట్‌ ప్లాట్‌ఫామ్‌ కంపెనీ పైన్‌ల్యాబ్స్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని ఆరంభించింది. దేశ్యాప్తంగా 1,20,000 స్టోర్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్టు తెలిపింది. 90 రకాల బ్రాండ్లు, 19 బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలతో పైన్‌ ల్యాబ్స్‌ ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కస్టమర్ల వద్దనున్న క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని ఆఫర్‌ చేస్తోంది. లక్షలాది కస్టమర్లకు డెబిట్‌, క్రెడిట్‌కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు

Most from this category