అత్యంత విలువైన బ్రాండ్‌గా ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్’
By Sakshi

ముంబై: దేశీ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. భారత్‌లోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. సమాచార సేవల సంస్థ డబ్ల్యూపీ రూపొందించిన భారత అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో ఈ బ్యాంకింగ్ సంస్థ 22.70 బిలియన్ అమెరికా డాలర్ల విలువతో తొలి స్థానాన్ని దక్కించుకుంది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ 20 బిలియన్ డాలర్ల విలువతో రెండవ స్థానంలో నిలిచింది. టీసీఎస్, ఎయిర్టెల్, ఎస్బీఐ వరుసగా 3,4,5 స్థానాల్లో ఉండగా.. గతేడాదిలో సైతం మొదటి ఐదు స్థానాల్లో ఇవే సంస్థలు నిలిచాయి. కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ఒక్కోస్థానం మెరుగుపడి 6,7 ర్యాంకులను సాధించగా.. మారుతీ ఆరు నుంచి ఎనిమిదికి పడిపోయింది. రిలయన్స్ జియో 9వ స్థానానికి చేరగా.. గతేడాది ఈ స్థానంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ 10వ స్థానానికి చేరింది.
You may be interested
చిన్న పరిశ్రమలకు డబ్బు కొరత రానీయం!
Saturday 28th September 2019ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివిధ మంత్రిత్వశాఖల నుంచి రూ.40,000 కోట్ల బకాయిలు చెల్లింపు అక్టోబర్ మొదటివారంలోపు మిగిలిన బకాయిల బదలాయింపు మంత్రిత్వశాఖల వ్యయ ప్రణాళికలకు సూచన తద్వారా ఆర్థిక వృద్ధికి జోష్ న్యూఢిల్లీ: చిన్న లఘు మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) నిధుల కొరత రాకుండా తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వస్తు, సేవల సరఫరాలకు సంబంధించి వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల నుంచి ఎంఎస్ఎంఈలకు రూ.40,000 కోట్ల బకాయిలను
పండుగల సీజన్లో ‘మారుతీ’ బంపర్ ఆఫర్
Saturday 28th September 2019బాలెనో మోడల్ కారుపై రూ. లక్ష తగ్గింపు న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తాజాగా మరో విడత భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పండుగల సీజన్లో బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాజాగా తన బాలెనో మోడల్ కారు ధరను రూ. 1,00,000 తగ్గించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈనెల 25న (బుధవారం) ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను రూ.5,000 వరకూ తగ్గించామని మారుతీ