News


హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 33 శాతం జంప్‌

Saturday 18th January 2020
news_main1579346720.png-31023

ప్రస్తుత ఆర్థిక సంవతర్సం మూడో త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు విశ్లేషకుల  అంచనాలను మించిన నమోదయ్యాయి. ఈ క్యూ3లో బ్యాంకు రూ.7,416.48 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ3లో సాధించిన రూ.5,585.85 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 32.77 శాతం అధికం. ఇతర ఆదాయం 35.52శాతం వృద్ధి చెంది రూ.6,669.28 కోట్లను సాధించింది. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం 12.69శాతం పెరిగి రూ.14,172.90కోట్లకి చేరింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల నిరర్ధక ఆస్తులు 1.38 శాతం నుంచి 1.42 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం స్వల్పంగా 0.42 శాతం నుంచి 0.48శాతం పెరిగాయి. నికర వడ్డీ ఆదాయ మార్జిన్‌ స్థిరంగా 4.20శాతంగా ఉంది. అక్టోబర్-డిసెంబర్ కాలంలో బ్యాంక్ ప్రీ-ప్రొవిజన్ ఆపరేటింగ్ లాభం 20.10 శాతం పెరిగి రూ 12,945.40 కోట్లకు చేరుకుంది.డిసెంబర్‌ 31నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ సైజ్‌ రూ.13.95 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకు ముం‍దు ఏడాది ఇది రూ.11.68 లక్షల కోట్లు. నిన్న మార్కెట్‌ ముగిసే సరికి షేరు ధర బీఎస్‌ఈలో 0.76శాతం తగ్గి రూ.1,277.85 వద్ద స్థిరపడింది. 



You may be interested

మిడ్‌క్యాప్‌ ర్యాలీకి కారణాలున్నాయ్‌..

Monday 20th January 2020

ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో పొజిషన్లు తీసుకుంటున్నారని.. స్మాల్‌ క్యాప్‌ విషయంలో ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నట్టు సెంట్రమ్‌ బ్రోకింగ్‌కు చెందిన నిశ్చల్‌ మహేశ్వరి పేర్కొన్నారు. గ్రామీణ రంగంలో మందగమనం ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ రంగంపై ప్రభావం చూపించినట్టు తెలిపారు. గత వేసవిలో, తర్వాత శీతాకాలంలో పంటల సాగు మంచిగానే ఉన్నందున రికవరీపై అంచనాలతో ఉన్నట్టు చెప్పారు. పంటల ఉత్పాదక బాగుంటే, గ్రామీణుల చేతుల్లో ఆదాయం పెరుగుతుందని,

ఆర్థిక మంత్రిగా కెవీ కామత్‌..?

Saturday 18th January 2020

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగం నిపుణులు, ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌, బ్రిక్స్‌ బ్యాంక్‌ ప్రస్తుత చైర్మన్‌  కెవీ కామత్‌ కేంద్రమంత్రి మండలిలోకి రానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కామత్‌కు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిత్వ శాఖను ఇచ్చే అవకాశాలున్నాయి. కాగా కామత్‌ గతంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ చైర్మన్‌గానే గాక ఇన్ఫోసిస్‌, ఇండియా ఇంక్‌ నెట్‌వర్క్‌లలో క్రియాశీలకంగా వ్యవహరించారు. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగంలో అపార అనుభవం ఉన్న కామత్‌ను కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా

Most from this category