News


హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.10,749 కోట్లు

Tuesday 5th November 2019
news_main1572923691.png-29342

(అప్‌డేటెడ్‌)

  • 76 శాతం వృద్ధి 
  • 186 రెట్లు పెరిగిన డివిడెండ్‌ ఆదాయం 
  • 16 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం 

న్యూఢిల్లీ: భారత్‌లో అతి పెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.10,749 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.6,097 కోట్లుతో పోల్చితే 76 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. గృహ్‌ ఫైనాన్స్‌లో వాటా విక్రయం, అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్‌ ఆదాయం బాగా పెరగడం, పన్ను భారం తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.22,951 కోట్ల నుంచి రూ.32,851 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

18 శాతం రుణ వృద్ధి...
పన్ను భారం రూ.1,022 కోట్ల నుంచి రూ.569 కోట్లకు తగ్గిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. గత క్యూ2లో రూ.6 ‍కోట్లుగా ఉన్న డివిడెండ్‌ ఆదాయం ఈ క్యూ2లో 186 రెట్లు ఎగసి రూ.1,074 కోట్లకు పెరిగిందని వివరించింది. 18 శాతం రుణ వృద్ధి సాధించామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.3,078 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్‌లో ఎలాంటి మార్పు లేకుండా 3.3 శాతం రేంజ్‌లోనే ఉందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా 1.29 శాతం నుంచి స్వల్పంగా 1.33 శాతానికి పెరిగాయని వివరించింది. కేటాయింపులు గత క్యూ2లో రూ.890 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.754 కోట్లకు తగ్గాయని తెలిపింది. 



You may be interested

'అనైతిక' ఆరోపణలకు ఆధారాల్లేవు

Tuesday 5th November 2019

ఇన్ఫోసిస్ వెల్లడి న్యూఢిల్లీ: కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ 'అనైతిక' విధానాలకు పాల్పడుతోందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంకా ప్రాథమిక ఆధారాలేమీ లభించలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. "ప్రస్తుతం ప్రాథమిక ఆధారాలేమీ లేవు. గుర్తు తెలియనివారు చేసిన ఆరోపణలపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణల విశ్వనీయత, నిజానిజాల గురించి కంపెనీ వ్యాఖ్యానించే పరిస్థితిలో లేదు" అని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీకి (ఎన్‌ఎస్‌ఈ) తెలియజేసింది. ఈ అంశంపై

హిృతిక్‌ స్టాక్స్‌ నుంచి మిడ్‌క్యాప్స్‌లోకి..

Tuesday 5th November 2019

హిృతిక్‌ స్టాక్స్‌ నుంచి పెట్టుబడులు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లోకి మళ్లొచ్చని అంచనా వేస్తున్నట్టు ఇండియానివేష్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ హెడ్‌ వినయ్‌ పండిట్‌ తెలిపారు. మార్కెట్లకు సంబంధించి తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో ఆయన పంచుకున్నారు.    దీపావళికి నిఫ్టీ నూతన గరిష్టాలను తాకొచ్చన్న తమ అంచనాలకు అనుగుణంగానే మార్కెట్లు ర్యాలీ చేస్తున్నట్టు పండిట్‌ పేర్కొన్నారు. లార్జ్‌క్యాప్‌ కంపెనీల ఎర్నింగ్స్‌లో 15-18 శాతం వృద్ధి ఉందని, మార్కెట్‌ వ్యాప్త ర్యాలీకి ఇది ప్రేరణనిస్తుందన్నారు. మొదటి

Most from this category