News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18 శాతం వృద్ధి

Monday 22nd July 2019
news_main1563779920.png-27228

  • రూ.5,676 కోట్ల కన్సాలిడేటెల్‌ లాభం నమోదు
  • స్టాండలోన్‌ లాభంలో 21 శాతం వృద్ధి
  • ఒక్కో షేరుకు రూ.5 ప్రత్యేక డివిడెండ్‌

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జూన్‌ త్రైమాసికానికి ఎప్పటి మాదిరే మంచి ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు కన్సాలిడేటెడ్‌ లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.4,808 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగి రూ.5,676 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.28,000 కోట్లతో పోలిస్తే 19 శాతం వృద్ధితో రూ.34,324 కోట్లకు చేరింది. జూన్‌ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.29,176 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.23,978 కోట్లుగానే ఉంది. ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం సైతం రూ.4,021 కోట్ల నుంచి రూ.5,148 కోట్లకు పెరిగింది. 
హెచ్‌డీఎఫ్‌సీ స్టాండలోన్‌ లాభం జూన్‌ క్వార్టర్‌లో రూ.5,568 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.4,601 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధ్యమైంది. స్టాండలోన్‌ ఆదాయం సైతం 22.7 శాతం వృద్ధితో రూ.32,361 కోట్లకు చేరుకుంది. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 1.40 శాతం, నికర ఎన్‌పీఏలు 0.43 శాతంగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ఎన్‌పీఏలు 1.33 శాతం, నికర ఎన్‌పీఏలు 0.41 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. విలువ పరంగా చూస్తే బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో రూ.11,768 కోట్లు, నికర ఎన్‌పీఏలు 3,567 కోట్లుగా ఉన్నాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ.2,613 కోట్లుగా ఉన్నాయి. కన్సాలిడేట్‌ రుణాలు 17 శాతం పెరిగి జూన్‌ చివరి నాటికి రూ.8,80,939 కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు తెలిపింది. బ్యాంకు కార్యకలాపాలు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూ.5 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని బ్యాంకు బోర్డు నిర్ణయం తీసుకుంది.



You may be interested

ఎగుమతుల వృద్ధికి సీఐఐ కీలక సూచనలు

Monday 22nd July 2019

న్యూఢిల్లీ: మహిళల వస్త్రాలు, ఔషధాలు, సైక్లిక్‌ హైడ్రోకార్బన్లు తదితర 31 ఉత్పత్తులు ఎగుమతుల పరంగా ఎక్కువ వృద్ధి అవకాశాలున్నట్టు పారిశ్రామిక సమాఖ్య సీఐఐ ఓ నివేదికలో తెలియజేసింది. ఎనిమిది నెలల తర్వాత దేశ ఎగుమతులు జూన్‌ మాసంలో ప్రతికూల జోన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. జూన్‌లో ఎగుమతులు 9.71 శాతం తగ్గి 25 బిలియన్‌ డాలర్లకు పరిమితమైన నేపథ్యంలో సీఐఐ ఈ కీలక సూచనలు చేసింది. మన ఉత్పత్తులను వినియోగించే

ఈ ఆర్థిక సంవత్సరమంతా మందగమనం ఉంటుంది: గిరీష్ పాయ్‌

Monday 22nd July 2019

జీడీపీ వృద్ధి 6-6.5శాతానికి పడిపోయే అవకాశం.  అమెరికా వృద్ధి మందగమనంపై మదుపర్ల ఆందోళన. దేశీయ, అంతర్జాతీయ మందగమన ప్రభావం ఎఫ్‌వై20 హెచ్‌2లో,  ఎఫ్‌వై 21 హెచ్‌1లో కనిపించనుంది.   ఆర్థిక సంవత్సరం 2020కి గాను ఆర్థిక వృద్ధి 6-6.5 శాతంగా నమోదుకావచ్చు. ఆదాయాల వృద్ధి 20-25 శాతం నుంచి తగ్గవచ్చని నిర్మల్ బంగ్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ గిరీష్ పై ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. వృద్ధి రేటు

Most from this category