News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫలితాలు ఎలా ఉంటాయి?

Friday 19th July 2019
news_main1563531101.png-27188

మార్కెట్‌ వాల్యూషన్‌ పరంగా దేశంలో అతిపెద్ద బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ జూన్‌ త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించనుంది. ఈ దఫా కూడా ఎప్పటిలాగే బ్యాంకు మంచి ఫలితాలు ప్రకటించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
- ప్రభుదాస్‌ లీలాధర్‌: గతేడాది క్యు1తో పోలిస్తే బ్యాంకు లాభంలో 27.50 శాతం, నికర వడ్డీ ఆదాయంలో 23.40 శాతం పెరుగుదల ఉండొచ్చు. ప్రీప్రొవిజనింగ్‌ కార్యనిర్వాహక లాభంలో కూడా 25.20 శాతం వృద్ధి ఉండొచ్చు. ఎప్పుడూ బ్యాంకు 20 శాతానికి తగ్గకుండా లాభాలను ప్రకటిస్తోందని, ఈ సారి అంతకన్నా ఎక్కువ లాభం ఉండొచ్చని అంచనా వేసింది. బ్యాంకు ఎక్కువగా ప్రొవిజన్లు కేటాయిస్తున్న సాగురంగం పనితీరును పరిశీలించాల్సిఉందని తెలిపింది. దీంతో పాటు రుణ మిశ్రమం, మార్జిన్లు, వృద్ది తదితర అంశాలను గమనించాలని తెలిపింది.
- కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: లోన్‌గ్రోత్‌లో మందగమనం కారణంగా 17 శాతానికి పరిమితం కావచ్చు. దీనివల్ల ఎన్‌ఐఐ వృద్ధి 20 శాతం మాత్రమే ఉండొచ్చు. ఆటోరంగ వాల్యూం గ్రోత్‌ బలహీనంగా ఉండడం, బ్యాంకు అన్‌సెక్యూర్డ్‌ రుణాలపై మరింత జాగ్రత్తలు తీసుకోవడం కారణంగా రిటైల్‌ లోన్‌ గ్రోత్‌ మందగించవచ్చు. నిబంధనల్లో మార్పుల కారణంగా ఫీజు ఆదాయ వృద్ది తగ్గవచ్చు. 



You may be interested

మూడేళ్ల కనిష్ఠానికి నిఫ్టీ ఆటో

Friday 19th July 2019

మరింత కుంగవచ్చంటున్న నిపుణులు తగ్గిపోతున్న విక్రయాలు, బలహీన రుతుపవనాలు, వ్యవస్థలో నగదు సన్నగిల్లడం, ఎకానమీలో మందగమన సంకేతాలు... ఆటో సూచీని కుంగదీస్తున్నాయి. వినిమయ విభాగంలో ఆటో రంగం నెగిటివ్‌ సెంటిమెంట్‌ దెబ్బకు విలవిలలాడుతోంది. గత కొంతకాలంగా నేలచూపులు చూస్తున్న నిఫ్టీ ఆటో సూచీ తాజాగా మూడేళ్ల కనిష్టానికి చేరింది. ఇంతటితో పతనం ముగియలేదని, మరింత అధ్వాన్నం ముందుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్యు1లో ఆటో విక్రయాలు గత ఐదేళ్లలో లేనంత వేగంగా క్షీణించాయి.

నిరాశపరిచిన గైడెన్స్‌: ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 14.50శాతం క్రాష్‌

Friday 19th July 2019

తొలి తైమాసిక ఫలితాలను ఆశించిన స్థాయిలో నమోదు చేసినప్పటికీ.., వచ్చే 2-3 త్రైమాసికాల్లో వృద్ధి బలహీనంగా వుండవచ్చంటూ  ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ఆర్‌బీఎల్‌ యాజమాన్యం హెచ్చరించడంతో ఆ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 14.50శాతం క్షీణించింది. ఈ ఏడాది పనితీరుపై తాజా అంచనాలు(గైడెన్స్‌) నిరాశపరచడంతో షేరు పతనానికి కారణమైంది. నేడు బ్యాంకు మొదటి క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ1లో రూ.267 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఇదే త్రైమాసిక కాలంలో ప్రకటించిన రూ.190

Most from this category