News


విరాళాల్లో హెచ్‌సీఎల్‌ నాడార్ టాప్‌..

Tuesday 15th October 2019
news_main1571114331.png-28889

  • ముకేశ్ అంబానీ మూడో స్థానంలో 
  • ఎడెల్‌గివ్ హురూన్ ఇండియా జాబితాలో వెల్లడి

ముంబై: సామాజిక సేవా కార్యక్రమాల కోసం అత్యధికంగా విరాళమిచ్చిన దేశీ దిగ్గజాల్లో టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్‌ అధిపతి శివ్‌ నాడార్ అగ్రస్థానంలో నిల్చారు. మరో టెక్‌ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ రెండో స్థానంలో ఉండగా.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రం మూడో స్థానంలో నిల్చారు. ఎడెల్‌గివ్ హురూన్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్‌ 2019 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నాడార్‌, ఆయన కుటుంబం మొత్తం రూ. 826 కోట్లు విరాళమివ్వగా, ప్రేమ్‌జీ రూ. 453 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు. ఇది వ్యక్తులకు సంబంధించిన జాబితా మాత్రమే కావడంతో టాటాలను ఇందులో చేర్చలేదని హురున్ ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. మతపరమైన కార్యక్రమాలకు కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల కోసం రూ. 5 కోట్ల పైబడి విరాళమిచ్చిన భారతీయుల సంఖ్య గతేడాదితో పోలిస్తే రెట్టింపై ఈ ఏడాది 72కి చేరినట్లు ఎడెల్‌గివ్ ఫౌండేషన్ సీఈవో విద్యా షా తెలిపారు. 2018లో ఈ సంఖ్య 38గా ఉంది. దాతృత్వ కార్యక్రమాల కోసం విరాళాలు రెట్టింపై రూ. 4,391 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో సుమారు సగభాగం వ్యక్తులు.. వ్యక్తిగత స్థాయిలో చేసినదే ఉండగా, మిగతా మొత్తం కంపెనీల నుంచి వచ్చింది. విరాళాల్లో అత్యధిక భాగం విద్యా రంగానికి దక్కాయి. 



You may be interested

కోల్‌ ఇండియా, ఐటీసీకి జీఎస్‌టీ ముప్పు?!

Tuesday 15th October 2019

క్రమంగా తగ్గుతూ వస్తున్న జీఎస్‌టీ వసూళ్లు అంతిమంగా ఐటీసీపై నెగిటివ్‌ ప్రభావం చూపుతాయా? అవునంటున్నారు నిపుణులు. జీఎస్‌టీ వసూళ్లలో తరుగుదల పూడ్చుకునేందుకు ప్రభుత్వం పొగాకుపై పన్ను పెంచుతుందని ఎక్కువమంది నిపుణులు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఐటీసీపై నెగిటివ్‌ ప్రభావం ఉంటుందంటున్నారు. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తాజాగా ఐటీసీపై రేటింగ్‌ను ‘కొనొచ్చు’ నుంచి ‘న్యూట్రల్‌’కు తగ్గించింది. పొగాకుతో పాటు బొగ్గుపై కూడా అదనపు సెస్సు విధించే ఛాన్సులున్నాయని అంచనా వేసింది.

శ్రీసిటీలో ఐఎంఓపీ ప్లాంట్‌ విస్తరణ

Tuesday 15th October 2019

కేవీబీపురం : శ్రీసిటీలోని జపాన్‌కు చెందిన ఇండియా మెటల్‌ వన్‌ స్టీల్‌ ప్లేట్‌ ప్రోసెసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐఎంఓపీ) పరిశ్రమ ఉత్పత్తి కేంద్రం విస్తరణ సోమవారం జరిగింది. ఐఎంఓపీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తకేషి హిరాయ్‌ నూతన ఉత్పత్తి కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 2012లో శ్రీసిటీలో ఏర్పాటైన ఐఎంఓపీ పరిశ్రమ కస్టమర్లకు వినూత్న పరిష్కారాలను అందిస్తోందని తకేషి హిరాయ్‌ అన్నారు. ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నూతనంగా ఫ్లాంటును విస్తరింపజేశామన్నారు. రూ.200కోట్ల పెట్టుబడులతో

Most from this category