News


హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లాభం రూ. 2,540 కోట్లు

Wednesday 24th October 2018
news_main1540360142.png-21422

న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.2,540 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.2,188 కోట్లతో పోలిస్తే 16 శాతం వృద్ధి సాధించామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం 6 శాతం పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ సి. విజయ్‌కుమార్‌ చెప్పారు. గత క్యూ2లో రూ.12,434 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 20 శాతం వృద్ధితో రూ.14,861 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.  సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 7 శాతం ఎగసిందని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. 
ఆదాయ వృద్ధి 10-12 శాతం రేంజ్‌లో..
ఆదాయం, మార్జిన్ల వృద్ధి అంశాల్లో సీక్వెన్షియల్‌గా పటిష్టమైన వృద్ధిని సాధిస్తున్నామని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే జోరును కొనసాగించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. డాలర్ల పరంగా చూస్తే, ఈ క్యూ2లో నికర లాభం 5 శాతం వృద్ధితో 35.67 కోట్ల డాలర్లకు, ఆదాయం 9 శాతం వృద్ధితో 209 కోట్ల డాలర్లకు పెరిగాయని చెప్పారు. నిర్వహణ మార్జిన్‌  9 శాతం వృద్ధితో రూ.2,966 కోట్లకు చేరిందని వివరించారు. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10-12 శాతం వృద్ది సాధించగలదన్న  అంచనాలను ఆయన వెల్లడించారు. ఈ క్యూ2లో 11,683 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో తమ కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,27,875కు పెరిగిందని వివరించారు. ఆట్రీషన్‌ రేటు​ 17.1 శాతంగా ఉందని వివరించారు. 
25.8 శాతానికి ఆర్‌ఓఈ
రన్‌-రేట్‌ ప్రాతిపదికన(పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే) నికర లాభం రూ.10,000 కోట్లు దాటేసిందని కంపెనీ సీఎఫ్‌ఓ ప్రతీక్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. రూ.4,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, దీంతో తమ రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 25.8 శాతానికి పెరిగిందని  వివరించారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ మార్జిన్‌ 20-21 శాతం రేంజ్‌లో ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ 2.7 శాతం నష్టంతో రూ.953 వద్ద ముగిసింది. 


 You may be interested

ఫార్మా ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Wednesday 24th October 2018

సాధారణంగా కరెక‌్షన్‌ సమయంలో రక్షణాత్మక రంగాలకు చెందిన షేర్లపై ఇన్వెస్టర్లు ఆధారపడుతుంటారు. ఇలాంటి రక్షణాత్మక రంగాల్లో ఫార్మా రంగం కీలకమైనది. ఫార్మారంగం స్టాక్‌మార్కెట్‌ పతన సమయాల్లో మంచిదే కానీ దీంట్లో సైతం మంచి చెడు ఉన్నాయి. సెప్టెంబర్‌ ఫలితాల సీజన్‌ సందర్భంగా ఫార్మా రంగంపై సమీక్ష... - నిఫ్టీ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 0.17 శాతం రాబడినివ్వగా ఫార్మా సూచీ ఈ ఏడాది ఇంతవరకు 0.77 శాతం మేర లాభాల్లో

ఇక మరిన్ని కంపెనీల పెట్రోల్‌ బంక్‌లు!

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: ఇంధనాల రిటైలింగ్ వ్యాపారంలో పోటీని ప్రోత్సహించటంపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనికోసం లైసెన్సింగ్‌ నిబంధనలను సరళీకరించాలనే ఉద్దేశంతో... నిపుణుల కమిటీని నియమించింది. మరిన్ని ప్రైవేట్ సంస్థలు పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేసేందుకు తోడ్పడే అంశాలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ప్రస్తుతం దేశీయంగా ఇంధన రిటైలింగ్ లైసెన్స్ పొందాలంటే.. హైడ్రోకార్బన్స్ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్‌, పైప్‍లైన్ల లేదా ద్రవీకృత సహజ వాయువు టర్మినల్స్ ఏర్పాటు మొదలైన వాటిపై రూ.2,000

Most from this category