News


హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ.2,944 కోట్లు

Saturday 18th January 2020
news_main1579318376.png-31003

  • 13 శాతం వృద్ధి 
  • 16 శాతం వృద్ధితో రూ.18,135 కోట్లకు ఆదాయం 
  • ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ 


న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌లో 13 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,605 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.2,944 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.15,699 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.18,135 కోట్లకు పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ సి. విజయకుమార్‌ పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 17 శాతం వృద్ధితో 43 కోట్ల డాలర్లకు, ఆదాయం 16 శాతం వృద్ధితో 250 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనాలను సవరిస్తున్నామని విజయకుమార్‌ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 16.5-17 శాతం రేంజ్‌లో పెరగగలదని గతంలో అంచనా వేశామని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ అంచనాలను 15-17 శాతంగా సవరిస్తున్నామని వివరించారు. హెచ్‌సీఎల్‌ సాఫ్ట్‌వేర్‌ ఆరంభించి ఆరునెలలే అయిందని, ఇప్పటికే 4,600 మంది కస్టమర్స్‌ను సాధించామని పేర్కొన్నారు. 

ఈ క్యూ3లో స్థూలంగా 11,502 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.49,173కు పెరిగిందని విజయకుమార్‌ చెప్పారు. ఆట్రీషన్‌ రేటు (ఉద్యోగుల వలస) 16.8 శాతంగా ఉందని వివరించారు. 

పటిష్ట పనితీరు కొనసాగుతోంది...
గత కొన్నేళ్లుగా మంచి పనితీరు సాధించడాన్ని కొనసాగిస్తున్నాం. ఈ క్వార్టర్‌లో 1,000 కోట్ల డాలర్ల ఆదాయ మైలురాయిని దాటేశాం. ఆదాయం 16 శాతం వృద్ధి సాధించగా, ఎబిట్‌ 20 శాతం మేర పెరిగింది. లాభదాయకత, వృద్ధి, ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహాలు పటిష్టంగా ఉన్నాయనే విషయాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. 
-సి. విజయకుమార్‌, సీఈఓ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  

 



You may be interested

ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ లాభం 10 శాతం అప్‌

Saturday 18th January 2020

8 శాతం పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.186 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.204 కోట్లకు పెరిగిందని ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ తెలిపింది. ఆదాయం రూ.1,317 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.1,423 కోట్లకు పెరిగిందని

టీసీఎస్‌ లాభం రూ.8,118 కోట్లు

Saturday 18th January 2020

(అప్‌డేటెడ్‌...) 0.2 శాతమే వృద్ధి  7 శాతం పెరిగిన ఆదాయం  ఒక్కో షేర్‌కు రూ. 5 మధ్యంతర డివిడెండ్‌ ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్యూ3లో 8,118 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించినట్లు టీసీఎస్‌ తెలిపింది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.8,105 కోట్ల నికర లాభం వచ్చిందని, 0.2 శాతం వృద్ధి

Most from this category