News


హావెల్స్‌ నూతన శ్రేణి వాటర్‌ ప్యూరిఫయర్లు

Thursday 6th February 2020
news_main1580961592.png-31545

హైదరాబాద్‌: ఫాస్ట్‌ మూవింగ్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ కంపెనీ హావెల్స్‌ ఇండియా నూతన శ్రేణి ఆల్కలైన్‌ వాటర్‌ ప్యూరిఫయర్లను విడుదల చేసింది. మార్కెట్లో చాలా ఆర్‌వో ప్యూరిఫయర్లు 70 శాతం నీటిని వృధా చేస్తాయని, రికవరీ 30 శాతమే ఉంటుందని కంపెనీ సీరియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌ సిసోడియా తెలిపారు. వైస్‌ ప్రెసిడెంట్లు శశాంక్‌ శ్రీవాస్తవ్‌, అనిల్‌ శర్మ, బిజినెస్‌ హెడ్‌ వి.మహేందర్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హావెల్స్‌ రూపొందించిన డిలైట్‌ ఆల్కలైన్‌ హై రికవరీ మోడల్‌తో 50 శాతం నీరు రికవరీ అవుతుందని వెల్లడించారు. కంపెనీ సొంతంగా ఏడాదిపాటు శ్రమించి వీటిని అభివృద్ధి చేసిందని చెప్పారు. ఉత్పత్తుల ధరల శ్రేణి రూ.15,000తో మొదలుకుని రూ.24,000 వరకు ఉందని వివరించారు. రానున్న రోజుల్లో ఇతర మోడల్స్‌ను కూడా ఆల్కలైన్‌ వాటర్‌ ప్యూరిఫయర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. వాటర్‌ ప్యూరిఫయర్ల మార్కెట్లో హావెల్స్‌కు 2018-19లో 3 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 6 శాతానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. 



You may be interested

ఏడేళ్ల గరిష్టానికి సేవల రంగం కార్యకలాపాలు

Thursday 6th February 2020

జనవరిలో 55.5కు చేరిక న్యూఢిల్లీ: భారత సేవల రంగం కార్యకలాపాలు జనవరి నెలలో ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ డిసెంబర్‌లో ఉన్న 53.3 పాయింట్ల నుంచి జనవరి నెలలో 55.5 పాయింట్లకు చేరుకుంది. జనవరి నెలలో నూతన ఆర్డర్ల రాకతో ఉపాధి కల్పన, వ్యాపార ఆశావహ, సానుకూల మార్కెట్‌ పరిస్థితులకు దోహదపడినట్టు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ సంస్థ పేర్కొంది. నూతన ఆర్డర్ల రాక

సెన్సెక్స్‌.. సెంచరీతో షురూ

Thursday 6th February 2020

సెన్సెక్స్‌ 132 పాయింట్లు ప్లస్‌ 42 పాయింట్లు ఎగసిన నిఫ్టీ మెటల్‌, ఫార్మా, ఐటీ ప్లస్‌లో ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. 132 పాయింట్లు బలపడి 41,275కు చేరింది. నిఫ్టీ సైతం 42 పాయింట్లు పుంజుకుని 12,131 వద్ద ట్రేడవుతోంది. బుధవారం అమెరికా ఇండెక్సులు వరుసగా రెండో రోజు సరికొత్త గరిష్ట రికార్డులను సాధించగా.. దేశీయంగానూ

Most from this category