News


హావెల్స్‌ స్మార్ట్‌ స్విచ్‌ గేర్స్‌

Thursday 17th October 2019
news_main1571284901.png-28939

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ హావెల్స్‌ ఇండియా స్టడెక్స్‌ పేరుతో స్మార్ట్‌ స్విచ్‌ గేర్స్‌ను ప్రవేశపెట్టింది. మినియేచర్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌ (ఎంసీబీ), డిస్ట్రిబ్యూషన్‌ బోర్డ్‌ సాంకేతికంగా అత్యాధునికమైనవని హావెల్స్‌ ప్రెసిడెంట్‌ సౌరభ్‌ గోయల్‌ తెలిపారు. ఏపీ, తెలంగాణ బిజినెస్‌ హెడ్‌ మహేందర్‌ వల్లకాటితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వీటితో నిర్వహణ సమస్యలు ఉండవు. గృహ, కార్యాలయాల్లో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా రూపొందించాం. స్టడెక్స్‌లో 160 రకాల ఉత్పాదనలు ఉన్నాయి. బిల్డింగ్స్‌ విభాగంలో స్విచ్‌లు, స్విచ్‌ గేర్ల మార్కెట్‌ భారత్‌లో రూ.8,000 కోట్లుంది. ఇందులో హావెల్స్‌ వాటా 25 శాతం. జూన్‌ త్రైమాసికంలో 15 శాతం వృద్ధి సాధించాం. సెప్టెంబరు క్వార్టరులోనూ మెరుగైన వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. 



You may be interested

పెయింట్స్‌ విభాగంలోకి జేఎస్‌డబ్ల్యు

Thursday 17th October 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- వ్యాపార దిగ్గజం జేఎస్‌డబ్ల్యు గ్రూప్‌ పెయింట్స్‌ విభాగంలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలో కాయిల్‌ కోటింగ్స్‌ ప్లాంటు, కర్నాటకలో వాటర్‌ బేస్డ్‌ డెకొరేటివ్‌ పెయింట్స్‌ యూనిట్‌ నెలకొల్పింది. వీటి కోసం రూ.600 కోట్లు ఖర్చు చేస్తోంది. రెండు కేంద్రాల వార్షిక సామర్థ్యం 12.5 కోట్ల లీటర్లు. ముందుగా దక్షిణ, పశ్చిమ భారత్‌లో విస్తరిస్తామని జేఎస్‌డబ్ల్యు పెయింట్స్‌ జేఎండీ ఎ.ఎస్‌.సుందరేశన్‌ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘2022 నాటికి దేశవ్యాప్తంగా అడుగు

ద్రవ్యలోటును అదుపులో ఉంచాలి!

Thursday 17th October 2019

ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ వాషింగ్టన్‌: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్‌ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ సూచించారు. అయితే దేశ ఆదాయ అంచనాలు కొంత సానుకూలంగానే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. 2018లో భారత్‌ వృద్ధి రేటు 6.8 శాతం అయితే, 2019లో 6.1 శాతంగానే ఉంటుందని, 2020లో 7 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్‌ మంగళవారం

Most from this category