News


క్యూ1లో అంచనాలను అందుకోని హావెల్స్‌

Saturday 27th July 2019
Markets_main1564223778.png-27361

ఎలక్ట్రిక్‌ పరికరాల తయారీ సంస్థ హావెల్స్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికపు ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్యూ1లో కంపెనీ రూ.177.09 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్యూ1లో నికర లాభం రూ.211.2 కోట్లుగా నమోదైంది. విశ్లేషకులు మాత్రం ఈ క్యూ1లో రూ.240 కోట్ల నికరలాభాన్ని అంచనా వేశారు. ఇదే క్వార్టర్‌ కాలానికి రూ.2,960 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా, 4.5శాతం స్వల్ప వృద్ధిని సాధించి రూ.రూ.2,717 కోట్లను మాత్రమే సాధించింది. ఎబిటా 10.3శాతం క్షీణించి రూ.279.2 కోట్లుగానూ, మార్జిన్లు గతేడాది క్యూ1తో 10శాతం నుంచి 1.7శాతానికి పరిమితమయ్యాయి. కంపెనీ ప్రధాన ఆదాయ వనరులైన కేబుల్స్‌, లైటింగ్స్‌, స్విచ్‌గేర్‌ విభాగాల్లో ఆదాయాలు తగ్గడం త్రైమాసిక ఫలితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.


‘‘రియల్టీ రంగం, ప్రాజెక్ట్‌లు మందగించడం వలన నిర్మాణానికి సంబంధించిన స్విచ్ గేర్ల అమ్మకాలు మందగించాయి. కొత్త ప్రభుత్వ ప్రాజెక్టుల ఆలస్యం వలన పారిశ్రామిక కేబుల్,  ప్రొఫెషనల్ లైటింగ్‌లకు డిమాండ్ తగ్గించింది. అయితే కఠినమైన మార్కెట్‌ పరిస్థితుల్లో ఎలక్ట్రికల్‌ కన్జూ‍్యమర్‌ డ్యూరబుల్‌ మంచి ప్రదర్శన కనబరిచాయి.’’ అని ఎక్చ్సేంజీలకు కంపెనీ సమాచారం ఇచ్చింది.



You may be interested

ఐసీఐసీఐ క్యూ1 ఫలితాలు అదుర్స్‌!

Saturday 27th July 2019

ఐసీఐసీఐ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.1,908 కోట్ల నికర లాభాన్ని శనివారం ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 120 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఈ బ్యాంక్‌ లాభాలు రూ.1,350 కోట్లు-రూ.2,150 కోట్ల మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేసిన విషయం తెలిసిందే. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 27 శాతం (ఏడాది నుంచి ఏడాదికి) పెరిగి రూ.7,737 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఎన్‌ఐఐలో ఆదాయపు పన్ను వాపసుపై

స్వల్ప నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 27th July 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం స్వల్ప నష్టంతో ముగిసింది. రాత్రి సింగపూర్‌ మార్కెట్లో 11,314.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11327)తో పోలిస్తే 13 పాయింట్ల నష్టంతో ఉందనే విషయాన్ని గమనించాలి. జాతీయ, అం‍తర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ఫ్లాట్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వాతావారణం నెలకొంది. వారాంతాన్ని ఆసియా మార్కెట్లు నష్టాలతో యూరప్‌, అమెరికా

Most from this category