News


తెలంగాణలో హట్సన్‌ ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌

Thursday 13th February 2020
news_main1581567790.png-31744

  • 207 కోట్ల పెట్టుబడి; 250 ఉద్యోగాలు
  • అక్టోబర్‌ నుంచి కార్యకలాపాలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్... తెలంగాణలో అతిపెద్ద ఐస్‌క్రీమ్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. రూ.207 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లాలోని గోవింద్‌పూర్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 250 మందికి ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, స్థానికంగా ఉన్న సుమారు 4 వేల మంది పాడి రైతులు ప్రయోజనం పొందుతారని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ప్లాంట్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి ప్లాంట్‌ కార్యకలాపాలు ఆరంభమవుతాయని పేర్కొంది. హట్సన్‌ సంస్థ అరుణ్‌ ఐస్‌ క్రీమ్, హట్సన్‌, ఆరోక్య మిల్క్, ఐబాకో ఐస్‌క్రీమ్స్‌, ఓయాలో, అనీవా, సంటోసా బ్రాండ్లతో పాలు, పెరుగు, ఐస్‌క్రీమ్స్, నెయ్యి, పన్నీర్‌ వంటి అన్ని రకాల పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ కార్యకలాపాల్లో ఉంది. మన దేశంలో విక్రయించడంతో పాటు అమెరికా, మధ్యప్రాచ్యం వంటి 38 దేశాలకు ఎగుమతులూ చేస్తోంది. 



You may be interested

ఈ నెలాఖరు వరకు ఉచిత ఫాస్టాగ్‌

Thursday 13th February 2020

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను మరింత మెరుగుపరచడం కోసం ఈ నెలాఖరు వరకు ఫాస్టాగ్‌లను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనానికి ఫాస్టాగ్‌ తప్పనిసరి కాగా, ఈ ఏర్పాటు నిమిత్తం వసూలు చేస్తున్న రూ. 100 చార్జీని ఈ నెల 15 నుంచి 29 వరకు ఎత్తివేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రేషన్

192 బిలియన్ డాలర్లకు ఐటీ ఆదాయాలు

Thursday 13th February 2020

2019-20పై నాస్కామ్ అంచనా డిజిటల్‌ ఆదాయాల ఊతం ముంబై: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (ఐటీ-బీపీఎం రంగం ఆదాయాలు 2020 ఆర్థిక సంవత్సరంలో 8.4 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 192 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. 2019-20లో కొత్త తరం డిజిటల్ విభాగాల ఆదాయాలు 23 శాతం పెరగడం, నికరంగా 2.05 లక్షల ఉద్యోగాల కల్పన

Most from this category