News


జెట్‌ఎయిర్‌వేస్‌ కథ కంచికేనా..?

Saturday 22nd June 2019
news_main1561201810.png-26502

రుణ సంక్షోభంలో కూరుపోయిన జెట్‌ఎయిర్‌ కంపెనీ కథ కంపెనీ చేరునుందా..? అవుననే అంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. అప్పుల చెల్లింపు విషయంలో విఫలం కావడంతో ఇప్పటికే కంపెనీ రుణదాతలు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించారు. ఇప్పుడు తాజాగా ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని కన్షారియం బ్యాంకులు కూడా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించేందుకు నిర్ణయించుకున్నాయి. జెట్‌ఎయిర్‌వేస్‌పై దివాళా స్మృతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీని కోరున్నాయి. ఎస్‌బీఐ కన్షారియం ఇంటర్మ్‌ రెజుల్యూషన్‌ అడ్వైజరీగా అశితోష్‌ చావ్‌చరియాను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నిబంధన ప్రకారం ఇంటర్మ్‌ రిజల్యూషన్ ప్రొఫెషనల్ 270 రోజుల్లోగా పరిష్కార మార్గాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది.  రుణాదాతులు జెట్‌ఎయిర్‌వేస్‌లో వాటాలను కొనుగోలు చేయమని ఎతిహాద్‌, హిందూజా గ్రూప్‌లాంటి అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపారు. అయితే బ్యాంకులు తమ మొత్తం రుణాల్లో 85శాతాన్ని వదులుకోవాలని షరతుని విధించాయి. అయితే ఇంత భారీస్థాయిలో రుణాన్ని వదులుకునేందుకు బ్యాంకులు సుముఖంగా లేకపోవడంతో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వాటాను విక్రయించడానికి బిడ్లను ఆహ్వానించినప్పటికీ, బిడ్డింగ్‌లో షరతులతో ఏకైక సంస్థకు జెయిట్‌ ఎయిర్‌వేస్‌ను విక్రయించేందుకు ఇష్టంలేక రుణాదాతులు ఎన్‌సీఎల్‌ఎల్‌టీ ఆశ్రయించారు. జెట్‌ఎయిర్‌వేస్‌ బ్యాంకులకు రూ.8500 కోట్లు, ఉద్యోగులకు రూ.3,000 కోట్లు, వెండార్లు 1000 కోట్లు బాకీ పడిన సంగతి. ఈ ఏప్రిల్‌ 17 నుంచి కంపెనీ కార్యకలాపాలు నిలిపివేసింది.



You may be interested

ఆటో యాన్సిలరీ స్టాక్స్‌ కొనొచ్చా?

Saturday 22nd June 2019

 ఇటీవలి కాలంలో ఆటో యాన్సిలరీ(అనుబంధ) రంగ సంస్థల స్టాక్‌లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉం‍డడం ఆటో, దాని అనుబంధ రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో డిమాండ్‌ తగ్గుదల, బీఎస్‌ 4 నిబంధనల నుంచి బీఎస్‌ 6 కు మారుతుండడం, ఎలకి​‍్ట్రక్‌ వాహనాల కోసం ప్రభుత్వం తెస్తున్న పాలసీలు ఆటో రంగానికి సమస్యలుగా మారాయి. భారిగా నష్టపోయిన వాహన అనుబంధ రంగం స్టాక్‌ మార్కెట్లలో వాహన

ఇన్వెస్ట్‌మెంట్‌ యోగా!

Saturday 22nd June 2019

మనసుకు వచ్చే తీవ్ర ఆలోచనలను ఉపేక్షించేలా మానసిక క్రమశిక్షణ పెంచుకోవడం చేయాలని ప్రముఖ మానసిక నిపుణులు చెబుతుంటారు. మనసు కోతి లాంటిది, దాని ఇష్టానుసారం చిత్రమైన ఊహలు, కల్పనలు చేస్తుంటుంది. మార్కెట్లో పెట్టుబడుల సమయాన కోతి మనసు పెట్టే ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. ముఖ్యంగా కొనుగోలు సమయంలో మనసుకు వచ్చే తీవ్ర ఆలోచనలను నియంత్రించుకోలేకపోతే మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌ మట్టికొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఓపిక, సహనం, క్రమశిక్షణ అలవరచుకోవడానికి

Most from this category