News


జీవీకే పవర్‌కు రూ.96 కోట్ల నష్టం

Saturday 15th February 2020
news_main1581737883.png-31811

(అప్‌డేటెడ్‌...)

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.96 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.101 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. టర్నోవరు రూ.1,109 కోట్ల నుంచి రూ.1,156 కోట్లకు ఎగసింది. ఎయిర్‌పోర్టుల ఆదాయం రూ.930 కోట్ల నుంచి రూ.1,044 కోట్లకు చేరింది. 2019-20 తొమ్మిది నెలల్లో (ఏప్రిల్‌- డిసెంబరు)  రూ.3,257 కోట్ల టర్నోవరుపై రూ.388 కోష్టాన్ని నష్టాన్ని చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3,275 కోట్ల టర్నోవరుపై రూ.266 కోట్ల నష్టం వచ్చింది. రుణాలు, వడ్డీ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. కొన్ని ఖాతాల్ని బ్యాంకులు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించాయి. అప్పులు భారీగా పేరుకుపోతుండటం పట్ల ఆడిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. 



You may be interested

సగం తగ్గిన ఓఎన్‌జీసీ లాభం

Saturday 15th February 2020

చమురు, గ్యాస్‌ ధరలు తగ్గాయ్‌  ఉత్పత్తి కూడా క్షీణించింది  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో సగం తగ్గింది. గత క్యూ3లో రూ.8,263 కోట్లుగా ఉన్న నికర లాభం (స్టాండ్‌అలోన్‌) ఈ క్యూ3లో 50 శాతం క్షీణించి రూ.8,263 కోట్లకు తగ్గిందని ఓఎన్‌జీసీ తెలిపింది. చమురు, గ్యాస్‌ ధరలు పతనం కావడం, ఉత్పత్తి కూడా తగ్గడంతో నికర

భారత సీఈఓలతో 25న ట్రంప్‌ భేటీ

Saturday 15th February 2020

ఢిల్లీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఇరు దేశాల వాణిజ్య బంధం మరింత బలపడటం కోసం ఫిబ్రవరి 25న ఢిల్లీలో ఆయన కార్పొరేట్‌ ప్రముఖులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన్ను కలిసేందుకు సిద్దంగా ఉన్న దిగ్గజ సీఈఓల జాబితాలను భారత పరిశ్రమల

Most from this category