News


జీఎస్‌టీ వార్షిక రిటర్నుల గడువు తేదీ పొడగింపు

Friday 15th November 2019
news_main1573789115.png-29603

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను పరిధిలోని ట్యాక్స్‌ పేయర్లకు ఊరట లభించింది. జీఎస్‌టీ వార్షిక రిటర్న్స్‌ (జీఎస్‌టీఆర్‌–9) దాఖలు చేయడానికి గడువు తేదీలను కేంద్రం పొడిగించింది. 2017-18 రిటర్నులను దాఖలు చేయడానికి ఈ ఏడాది డిసెంబర్‌ 31 గడువు తేదీ కాగా, 2018-19 రిటర్నుల చివరి తేదీ వచ్చే ఏడాది మార్చి 31గా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా సమన్వయ నివేదిక (రికన్సిలియేషన్‌ స్టేట్‌మెంట్‌) దాఖలు తేదీల్లో కూడా మార్పులు చేసింది. మరోవైపు, జీఎస్‌టీ ఫామ్‌లను మరింత సులభతరం చేస్తున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ మండలి (సీబీఐసీ) ఒక ప్రకటనలో తెలిపింది. 



You may be interested

ఈటో మోటార్స్‌ ‘ఎలక్ట్రిక్‌’ కార్గో రైడ్‌

Friday 15th November 2019

ఏడాదిలో 4,000 ఎలక్ట్రిక్‌ కార్గో వాహనాలు సరఫరా చేయనున్న చైనా కంపెనీ బీవైడీ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీ దిగ్గజం ‘బీవైడీ’.. ఇదే రంగంలోని హైదరాబాదీ కంపెనీ ఈటో మోటార్స్‌తో  ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా బీవైడీ తయారీ టీ3 రకం ఫోర్‌ వీలర్‌ ఎలక్ట్రిక్‌ కార్గో వాహనాలను ఈటో కొనుగోలు చేయనుంది. తొలుత 50 వాహనాలకు ఈటో మోటార్స్‌ ఆర్డరిచ్చింది. అలాగే పెద్ద ఎత్తున త్రీ,

ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 6 లక్షల కోట్లు

Friday 15th November 2019

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.6 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పీసీ మోదీ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇది సగానికన్నా తక్కువ. అయినప్పటికీ బడ్జెట్‌లో నిర్దేశిత లక్ష్యాలను సాధించగలమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సత్వరం రీఫండ్స్ చేస్తున్నామని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే

Most from this category