News


బడ్జెట్‌ తర్వాత జీఎస్టీ రేట్ల సవరణ

Friday 3rd January 2020
Markets_main1578022811.png-30636

  • జీఎస్టీ నుంచి మినహాయించిన వస్తువులపై సమీక్ష
  • దశలవారీగా పన్ను రేట్లు పెంచే యోచన
  • మార్చి జీఎస్టీ కౌన్సిల్‌ల్లో కీలక సమావేశం


సాక్షి, అమరావతి: దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా వివిధ వస్తువులపై ఉన్న పన్ను రేట్లను పునః సమీక్షించనున్నారు. అత్యధిక వస్తువులను తక్కువ శాతం పన్ను పరిధిలో ఉండటంతో ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాల తర్వాత రేట్ల సమీక్షించాలని కిందటి నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో సూత్రప్రాయ అంగీకారినికి వచ్చాయి. ప్రస్తుతం 150కిపైగా వస్తువులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించగా, సుమారు 260 వస్తువులు 5 శాతం శా‍్లబులో ఉన్నాయి. నిర్దేశిత ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతుండటంతో జీఎస్టీ పరిధి నుంచి మినహాయించిన వస్తువులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏడాది ప్రతీ నెలా సగటు జీఎస్టీ ఆదాయం రూ.1.12 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా, లక్ష కోట్లు దాటడమే గగనంగా మారింది. తొమ్మిది నెలల కాలానికి సగటు నెల జీఎస్టీ ఆదాయం రూ.1,00,646 కోట్లకు పరిమితమయ్యింది. ఇదే సమయంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహార భారం పెరిగిపోతోంది. దీంతో ఆదాయం భారీగా కోల్పోతున్న సున్నా పన్ను పరిధిలో ఉన్న వస్తువులను గుర్తించి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేయోచనలో ఉన్నారు. ప్రస్తుతం 5%, 12%, 18%, 28% శ్లాబులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఈ నాలుగు ట్యాక్స్‌ శ్లాబులును మూడు శ్లాబులుగా మార్చమని సూచిస్తున్నాయి. 5 శాతం, 12 శాతం శ్లాబుల్లో ఉన్న వస్తువులను కలిపి 8 లేదా 9 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడం లేదా, 12, 18 శాతం శ్లాబులను కలిపి 15 లేదా 16 శాతంగా చేయాలని సూచిస్తున్నాయి. ఈ పన్ను రేటు సవరింపును ఒకేసారిగా కాకుండా దశలవారీగా చేపట్టాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం వచ్చే దిశగా మార్చి నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. You may be interested

మీ మొబైల్‌ కొద్దిసేపు స్విచాఫ్‌ చేయండి..!

Friday 3rd January 2020

వివో సరికొత్త ప్రచార కార్యక్రమం న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత అనుబంధాలపై అది చూపిస్తున్న ప్రభావాన్ని ‘స్విచాఫ్‌’ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థ వివో తెలియజేస్తోంది. తన బ్రాండ్‌ అంబాసిడర్‌ అమీర్‌ఖాన్‌తో కలసి ఈ కార్యక్రమాన్ని సంస్థ ఆరంభించింది. తమ మొబైల్‌ ఫోన్లను కొంత సమయం పాటు స్విచాఫ్‌ చేసి కుటుంబం, స్నేహితులతో గడపడంలో ఉన్న ఆనందాన్ని ఈ సంస్థ తన కార్యక్రమం ద్వారా భారతీయ వినియోగదారులకు

ఇరాక్‌ టెన్షన్‌- పసిడి, చమురుకు రెక్కలు

Friday 3rd January 2020

గురువారం రాత్రి ఇరాక్‌లోని బాగ్దాద్‌ వద్ద అమెరికా వైమానిక దాడులు చేపట్టినట్లు వెలువడిన వార్తలు అటు పసిడి, ఇటు ముడిచమురు ధరలకు ఆజ్యం పోశాయి. ఈ దాడుల కారణంగా బాగ్దాద్‌  విమానాశ్రయం వద్ద ఇరాన్‌, ఇరాక్‌లకు చెందిన ఇద్దరు ముఖ్య అధికారులు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు దారితీయవచ్చన్న ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రక్షణాత్మక

Most from this category