News


18న జీఎస్‌టీ మండలి సమావేశం

Thursday 5th December 2019
news_main1575518886.png-30067

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమీక్షా సమావేశం ఈ నెల 18వ తేదీన జరగనుంది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.  అంచనాలకన్నా తక్కువ జీఎస్‌టీ వసూళ్లు, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్‌టీ పరిహారం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. జీఎస్‌టీ పరిహారం అంశాన్ని ఈ సమీక్షా సమావేశం చర్చిస్తుందని బుధవారం స్వయంగా ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. అంతక్రితం ఆయన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ (డీఆర్‌ఐ) 62వ వ్యవస్థాపక దినోత్సవంలో ఠాకూర్‌ పాల్గొన్నారు. 



You may be interested

స్టీల్‌ షేర్లు... తగ్గినప్పుడల్లా కొనొచ్చు!

Thursday 5th December 2019

నిపుణుల సూచన అంతర్జాతీయంగా స్టీల్‌ రంగం బాగుందని, ఈ నేపథ్యంలో దేశీయ స్టీల్‌స్టాకుల్లో వచ్చే పతనాలకు ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి ఇలాంటి పతనాలను కొత్త కొనుగోళ్లకు అవకాశాలుగా మలచుకోవాలని చెప్పారు. ట్రేడ్‌వార్‌ జాప్యం జరగొచ్చన్న పుకార్లు ఇటీవల స్టీల్‌స్టాకుల్లో కరెక‌్షన్‌ తెచ్చాయి. యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలతో ఇటీవల కాలంలో జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, టాటాస్టీల్‌, జేఎస్‌పీఎల్, సెయిల్‌ తదితర షేర్లు నష్టాలు చూశాయి. అయితే వాల్యూషన్లు,

సీఎస్‌బీ బ్యాంక్‌ లిస్టింగ్‌...భేష్‌ !

Thursday 5th December 2019

(అప్‌డేట్‌...) ఇష్యూ ధర రూ.195 41 శాతం లాభంతో రూ.275 వద్ద లిస్టింగ్‌ 54 శాతం లాభంతో రూ.300 వద్ద ముగింపు  న్యూఢిల్లీ: సీఎస్‌బీ బ్యాంక్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లోనూ, ముగింపులోనూ మెరుపులు మెరిపించాయి. ఇష్యూ ధర రూ.195తో పోల్చితే లిస్టింగ్‌లో 41 శాతం లాభాన్ని, ముగింపులో 54 శాతం లాభాన్ని ఇన్వెస్టర్లకు పంచాయి. రూ.193-195 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ బ్యాంక్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 87 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. బుధవారం సీఎస్‌బీ

Most from this category