News


20న జీఎస్‌టీ మండలి సమావేశం

Saturday 14th September 2019
news_main1568435497.png-28365

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశం వచ్చే శుక్రవారం (20వ తేదీన) గోవాలో జరగనుంది. కార్ల నుంచి బిస్కెట్ల వరకూ ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని వస్తున్న డిమాండ్లపై ఈ అత్యున్నత స్థాయి జీఎస్‌టీ సమావేశం దృష్టి సారించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వ ఆదాయాలపై ప్రత్యక్షంగా ఎటువంటి ప్రభావం పడుతుందన్న విషయాన్ని మండలి సమీక్షిస్తుందని తెలుస్తోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆర్థిక మందగమనం, ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పడిపోవడం వంటి అంశాల నేపథ్యంలో జీఎస్‌టీ తగ్గింపునకు సంబంధిత వర్గాల నుంచి కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. 



You may be interested

రూపే కార్డులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు తగ్గింపు

Saturday 14th September 2019

ముంబై: రూపే డెబిట్‌ కార్డు లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును క్రమద్ధీకరించినట్టు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. అక్టోబర్‌ 20 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌), ఈకామ్‌, భారత్‌క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత మర్చంట్‌ లావాదేవీలపై రేట్లను క్రమబద్ధీకరించినట్టు వివరించింది. రూ.2,000కు పైన ఉండే లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ చార్జీని 0.60 శాతానికి సవరించామని, గరిష్టంగా రూ.150గానే ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం రూ.2,000పైన లావాదేవీలపై

ఎగుమతులు.. రివర్స్‌గేర్‌!

Saturday 14th September 2019

ఆగస్టులో 6 శాతం క్షీణత దిగుమతులూ 13.45 శాతం పతనం వాణిజ్యలోటు 13.45 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఆగస్టు ఎగుమతి-దిగుమతులు అద్దం పడుతున్నాయి. ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దిగుమతులదీ అదే ధోరణి. 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది జూలైలో ఎగుమతులు స్వల్పంగా 2.25 శాతం వృద్ధి చెందాయి. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలను చూస్తే... - ఆగస్టులో

Most from this category