News


పన్ను రేట్ల కోత?

Friday 20th September 2019
news_main1568954293.png-28446

  • నేడు జీఎస్‌టీ మండలి కీలక సమావేశం

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి 37వ కీలక సమావేశం శుక్రవారం గోవాలో జరగనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో... పన్నులు తగ్గించాలని, తద్వారా వ్యవస్థలో డిమాండ్‌ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని పలు పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ కీలక జీఎస్‌టీ సమావేశం జరగనుంది. పన్నుల తగ్గింపుపై ఈ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుందని కూడా సమాచారం. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో బిస్కెట్ల నుంచి ఆటోమొబైల్ విభాగం వరకూ, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) నుంచి హోటెల్స్‌ వరకూ వివిధ రంగాల నుంచి రేట్ల తగ్గింపునకు గట్టి డిమాండ్‌ వస్తోంది. పన్ను కోతల వల్ల వినియోగం, దేశీయ డిమాండ్‌ పెరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే పన్నుల తగ్గింపువల్ల అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యవస్థ మరింత ఇబ్బందుల్లో పడుతుందని జీఎస్‌టీ కౌన్షిల్‌ ఫిట్‌మెంట్‌ కమిటీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

సమావేశంలో చర్చించే అవకాశమున్న మరిన్ని అంశాలు...

  • జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి 370 అధికరణ రద్దు నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు జీఎస్‌టీ చట్ట నిబంధనల వర్తింపునకు సవరణలపై చర్చ
  • పసిడి, ఇతర విలువైన రాళ్ల రవాణా విషయంలో కేరళ ప్రతిపాదిస్తున్న  ఈ-వే బిల్‌ వ్యవస్థపై దృష్టి
  • ఆధార్‌తో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ అనుసంధాన ప్రతిపాదన

సానుకూల నిర్ణయం ఆశిస్తున్నాం: టాటా మోటార్స్‌
కాగా తాజా జీఎస్‌టీ సామావేశం ఆటో రంగానికి సంబంధిత తగిన సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది. మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌  గుంటర్‌ బషెక్‌ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఆటో రంగం పురోగతికి సంబంధించి జీఎస్‌టీ మండలి నుంచి ఒక కీలక నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. 



You may be interested

హువావే ‘మేట్‌ 30’ సిరీస్‌ ఆవిష్కరణ

Friday 20th September 2019

తొలి సెకండ్‌ జనరేషన్‌ ‘5జీ’ స్మార్ట్‌ఫోన్‌  చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హువావే’ తన అధునాతన ‘మేట్‌ 30’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను గురువారం ఆవిష్కరించింది. ‘మేట్‌ 30’, ‘మేట్‌ 30 ప్రో’ పేరిట తొలి సెకండ్‌ జనరేషన్‌ ‘5జీ’ స్మార్ట్‌ఫోన్లను పరిచయంచేసింది. వీటిలో గూగుల్‌ లైసెన్స్ పొందిన యాప్స్‌ అయిన మ్యాప్స్, జీ మెయిల్‌, యూట్యూబ్‌ లేవని ప్రకటించింది. కిరిన్ 990 ప్రాసెసర్ ఆధారంగా ఇవి

మధ్యప్రాచ్య అనిశ్చితి..పెరిగిన చమురు

Friday 20th September 2019

సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరిగాక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్‌లో చమురు లాభపడి ట్రేడవుతోంది. ఉదయం 9.37 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.54 శాతం పెరిగి బారెల్‌ 63.67 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.88 శాతం పెరిగి 58.70 వద్ద ట్రేడవుతున్నాయి. సౌదీ చమురు కేంద్రాలపై జరిగిన డ్రోన్‌ దాడికి ఇరాన్‌ కారణంగా చూపుతూ, అమెరికా, మధ్యప్రాచ్యంలో సౌదీ నేతృత్వంలో యూరోపియన్‌ దేశాలతో

Most from this category