News


జీఎస్‌టీ పరిహార చెల్లింపులకు కట్టుబడి ఉన్నాం

Tuesday 17th December 2019
news_main1576553172.png-30259

  • వసూళ్లు తగ్గినందునే చెల్లింపుల్లో జాప్యం
  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

ముంబై: జీఎస్‌టీ పరిహార చెల్లింపులపై కేంద్రం తన హామీని విస్మరించబోదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి భరోసానిచ్చారు. వసూళ్లు తగ్గినందునే పరిహార చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు వివరణ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు అసహనానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. పరిహారాన్ని వెంటనే కేంద్రం చెల్లించాలంటూ కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తు‍న్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఇలా స్పందించారు. ‘‘ఇది వారి హక్కు. నేను తోసిపుచ్చడం లేదు. దీన్ని నిలబెట్టుకోకపోవడం ఉండదని స్పష్టం చేయదలుచుకున్నాను’’ అని వివరించారు. ముంబైలో సోమవారం జరిగిన టైమ్స్‌ నెట్‌వర్క్‌ ‘భారత ఆర్థిక సదస్సు’ను ఉద్దేశించి ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 
ఆదాయ పెంపునకు ఉమ్మడి చర్యలు...
ప్రకృతి విపత్తులు, వినియోగం మందగించడం జీఎస్‌టీ వసూళ్లపై నేరుగా ప్రభావం చూపినట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ‘‘రాష్ట్రాలతో కలసి పనిచేస్తున్నాం. జీఎస్‌టీ వసూళ్ల పెంపునకు ఇరువైపులా ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది. వీటి ఫలితంగా జీఎస్‌టీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది’’ అని ఆమె చెప్పారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఏదో ఒక సమయంలో జీఎస్‌టీ కౌన్సిల్‌ దీనిపై స్పందిస్తుందన్నారు. 
డేటా (సమాచారం) విశ్వసనీయతపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. పలు స్థూల ఆర్థిక గణాంకాల మదింపు విధానాలపై ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చారు. ‘‘డేటాకు సంబంధించి ఎటువంటి అనుమానాలనైనా నివృత్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ డేటా అయినా అది విశ్వసనీయతతో, ఆమోదనీయంగా ఉంటుంది’’ అని మంత్రి చెప్పారు. 


రాష్ట్రాలకు రూ.35,298 కోట్ల పరిహారం
కీలకమైన జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీ ఈ నెల 18న జరగనుండగా, రెండు రోజుల ముందు సోమవారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.35,298 కోట్లను జీఎస్‌టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ మండలి (సీబీఐసీ) ట్వీట్‌ ద్వారా తెలియజేసింది. సకాలంలో పరిహార చెల్లింపులను కేంద్రం విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నట్టు పలు రాష్ట్రాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. You may be interested

వేదాంత రూ.60,000 కోట్ల పెట్టుబడి

Tuesday 17th December 2019

2-3 ఏళ్లలో పెడతామన్న చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ముంబై: వేదాంత కంపెనీ రానున్న 2-3 ఏళ్లలో రూ.60,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. రానున్న 4- 5 ఏళ్లలో 3,000- 4,000 కోట్ల డాలర్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వేదాంత రిసోర్సెస్ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. ఇదే కాలానికి 1,000 కోట్ల డాలర్ల నికర లాభం సాధించడం లక్ష్యమని వివరించారు. ఇక్కడ జరిగిన ఇండియా ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌

సెజ్‌లోని ఐటీ కంపెనీల పన్ను తగ్గించండి

Tuesday 17th December 2019

15 శాతానికి పరిమితం చేయాలన్న ఐటీ పరిశ్రమ బీమాపై పన్ను భారం తగ్గించాలన్న ఆర్థిక రంగ సంస్థలు పన్నులను క్రమబద్ధీకరించాలన్న మొబైల్‌ కంపెనీలు బడ్జెట్‌ ముందస్తు చర్చలో భాగంగా డిమాండ్లు న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) నుంచి పనిచేసే ఐటీ కంపెనీలపై 15 శాతమే కార్పొరేట్‌ పన్ను విధించాలని కేంద్రాన్ని ఐటీ పరిశ్రమ డిమాండ్‌ చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న దృష్ట్యా... దీనికోసం సోమవారం

Most from this category