News


ఆగస్ట్‌లో తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు

Monday 2nd September 2019
news_main1567402537.png-28146

  • రూ.98,202 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)రూపంలో ఆదాయ వసూళ్లు ఆగస్ట్‌ నెలలో లక్ష కోట్ల మార్క్‌ దిగువకు పడిపోయాయి. అంతక్రితం నెల జూలైలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.02 లక్షల కోట్లుగా ఉంటే, ఆగస్ట్‌లో రూ.98,202 కోట్లు వసూలయ్యాయి. అయితే, 2018 ఆగస్ట్‌ నెలలో వచ్చిన ఆదాయం రూ.93,960 కోట్లతో పోలిస్తే మాత్రం పెరిగినట్టు చెప్పుకోవాలి. జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్‌ దిగువకు రావడం ఈ ఏడాది రెండోసారి. జూన్‌లోనూ రూ.99,939 కోట్లే వసూలు అయ్యాయి. ఆగస్ట్‌ నెల వసూళ్లలో రూ.17,733 కోట్లు సెంట్రల్‌ జీఎస్‌టీ కాగా, స్టేట్‌ జీఎస్‌టీ రూ.24,239 కోట్లు, ఇంటెగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.49,958 కోట్లుగా ఉన్నాయి. సెస్సు రూ.7,273 కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది. జూలై నెలకు సంబంధించి జీఎస్‌టీఆర్‌ 3బీ రిటర్నులు 75.80 లక్షలు దాఖలయ్యాయి. జూన్‌, జూలై నెలలకు సంబంధించి రూ.27,955 కోట్లు రాష్ట్రాలకు పరిహారంగా విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ వరకు జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.5,14,378 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.4,83,538 కోట్లతో పోలిస్తే 6.3 శాతం వృద్ధి నమోదైంది. 



You may be interested

ఆన్‌లైన్‌లో ఔషధాలు... ఇవి తెలుసుకోవాల్సిందే!

Monday 2nd September 2019

నిమిషాల్లో ఆర్డర్‌ ఇచ్చేయవచ్చు ఇంటికే నేరుగా ఔషధాల డెలివరీ ఎంఆర్‌పీపై భారీగా డిస్కౌంట్‌ కాకపోతే డెలివరీకి ఎక్కువ సమయం సంప్రదాయ దుకాణాల్లో డిస్కౌంట్‌ తక్కువే వెంటనే ఔషధాలు కావాలంటే ఇవే మార్గం డాక్టర్‌ రాసిన మందుల చీటిని ఫోన్‌ కెమెరా నుంచి క్లిక్‌ మనిపించి, దాన్ని మొబైల్‌ యాప్‌ నుంచి అప్‌లోడ్‌ చేసి, చిటికెలో ఆర్డర్‌ చేసేయడం... ఆ తర్వాత 24 గంటల నుంచి 48 గంటల్లోపు ఇంటికే ఔషధాలు వచ్చేయడం నేడు పట్టణాల్లో చూస్తున్నాం. చిన్న పట్టణాల

ఎస్‌బీఐ కార్డు నుంచి త్వరలో రూపే కార్డులు

Monday 2nd September 2019

న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల సంస్థ ఎస్‌బీఐ కార్డ్ త్వరలో రూపే పేమెంట్ నెట్‌వర్క్ ఆధారిత కార్డులను జారీ చేయనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో కుదుర్చుకోవాల్సిన ఒప్పందం ఒకటి ఉందని, ఇది పూర్తయిన వెంటనే రూపే కార్డులకు సంబంధించి కొన్ని ఉత్పత్తులను ప్రవేశపెడతామని ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ హర్‌దయాళ ప్రసాద్‌ తెలిపారు. జాతీయతా భావం రగులుతున్న నేపథ్యంలో రూపే కార్డులే కావాలని అడుగుతున్న వారి సంఖ్య పెరుగుతోందని

Most from this category