జీఎస్టీ వసూళ్లు పేలవమే..!
By Sakshi

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అక్టోబర్‌లో 5.29 శాతం తగ్గాయి. రూ.95,380 కోట్లుగా నమోదయాయ్యియి. 2018 ఇదే నెల్లో ఈ వసూళ్లు రూ.1,00,710 కోట్లు. శుక్రవారం ప్రభుత్వం ఈ గణాకాలను విడుదల చేసింది. జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకన్నా తగ్గడం ఇది వరుసగా మూడవనెల. నిజానికి పండుగల సీజన్ కావడంతో అక్టోబర్‌లో అయినా రూ. లక్ష కోట్లపైబడి జీఎస్టీ వసూళ్లు జరుగుతాయన్న అంచనా ఉంది. అయితే ఈ అంచనాలూ తప్పడం ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని ప్రతిబింబిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.91,916 కోట్లు. గణాంకాల ప్రకారం కొన్ని ముఖ్యాంశాలు చూస్తే- స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.95,380 కోట్లు. అందులో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.17,582 కోట్లు. స్టేట్ జీఎస్టీ వాటా రూ.23,674 కోట్లు. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) రూ.46,517 కోట్లు. సెస్ రూ.7,607 కోట్లని ఆర్థికశాఖ పేర్కొంది. కాగా మొత్తం జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్ (సమ్మరీ ఆఫ్ సెల్్ప అసెస్డ్ రిటర్న్) 73.83 లక్షలకు చేరాయి. 2017 జూలై 1వ తేదీ నుంచీ జీఎస్టీ అమల్లోకి వచ్చింది.
You may be interested
యస్ బ్యాంక్ నష్టాలు రూ.629 కోట్లు
Saturday 2nd November 2019రూ.8,348 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం 2.7 శాతానికి పడిపోయిన నికర వడ్డీ మార్జిన్ న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో రూ.629 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. పన్ను వాయిదా సర్దుబాటు భారం రూ.709 కోట్ల కారణంగా ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని యస్ బ్యాంక్ తెలిపింది. స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి చూస్తే ఇది ఈ బ్యాంక్‌కు రెండో త్రైమాసిక
సూచీల గమనంపై విశ్లేషకుల అభిప్రాయాలు
Friday 1st November 2019ప్రధాన సూచీలు నూతన గరిష్టాలను సమీపించాయి. సెన్సెక్స్ ఇప్పటికే నూతన గరిష్టాలను చేరుకుంది. నిఫ్టీదే తరువాయి. మరి ఈ క్రమంలో తదుపరి సూచీల గమనంపై విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. నిఫ్టీ 11,850-11,840 శ్రేణిని దిగిపోతే లాభాల స్వీకరణ చోటు చేసుకుంటుంది. దాంతో నిఫ్టీ 11,770-11,720 వరకు వెళ్లొచ్చు. స్వల్ప కాల చార్ట్‌పై ఆర్ఎస్ఐ అధిక కొనుగోళ్ల జోన్‌కు చేరింది. ఇది స్వల్ప కరెక్షన్ను సూచిస్తోంది. - ఆదిత్య అగర్వాల్,