News


ఎల్‌ఐసీ ఎన్‌పీఏలు చాలా ఎక్కువే..!

Thursday 27th February 2020
news_main1582744633.png-32116

దేశ ప్రజల్లో ఎక్కువ మంది విశ్వసించే భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) డెట్‌ పోర్ట్‌ఫోలియోలో స్థూల నిరర్థక ఆస్తులు (వసూలు కష్టంగా ఉన్నవి) 2019 చివరికి 7.49 శాతానికి చేరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకు వచ్చే ప్రణాళికల్లో ఎల్‌ఐసీ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌ చేయాలని ఆశిస్తున్న వారు ఈ అంశాలను తెలుసుకోవాల్సిందే.

 

2018 చివరికి డెట్‌ పెట్టుబడుల్లో ఎన్‌పీఏలు 6.06 శాతంగానే ఉంటే, ఏడాది తిరిగే సరికి ఇవి 7.49 శాతానికి పెరగడం ఆస్తుల నాణ్యత క్షీణించడాన్ని సూచిస్తోంది. ఎల్‌ఐసీ చరిత్రలో ఇదే అత్యధిక ఎన్‌పీఏ రేషియో కావడం గమనార్హం. పోటీ సంస్థలు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలకు ఎటువంటి ఎన్‌పీఏలు లేకపోవడాన్ని గమనించాలి. అయితే ఎల్‌ఐసీ నికర ఎన్‌పీఏలు మాత్రం 2018 డిసెంబర్‌లో ఉన్నట్టుగానే 0.36 శాతం వద్దే స్థిరపడ్డాయి. ఎల్‌ఐసీ బ్యాలన్స్‌ షీటు రూ.32.5 లక్షల కోట్లుగా డిసెంబర్‌ చివరి నాటికి ఉంది.

 

బ్యాంకుల్లో ఎస్‌బీఐ స్థూల ఎన్‌పీఏ రేషియో డిసెంబర్‌ చివరికి 6.94 శాతంగా ఉండగా, ఐసీఐసీఐ బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 5.95 శాతంగా ఉన్నాయి. 
జీవిత బీమా కంపెనీలు దీర్ఘకాలిక ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. 2019 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఎల్‌ఐసీ డెట్‌ (ఈక్విటీయేతర) విభాగంలో చేసిన పెట్టుబడులు రూ.58,615 కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో రూ.2.81 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి మొత్తం మీద ఎల్‌ఐసీ స్థూల ఎన్‌పీఏలు 6.1 శాతంగా ఉన్నాయి. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలానికి 5.95 శాతం కావడం గమనార్హం. 



You may be interested

200డీఎంఏ దిగువన మద్దతు 11,500

Thursday 27th February 2020

నిఫ్టీ వరుసగా నాలుగో రోజూ నష్టపోయింది. 11,700 మార్క్‌ దిగువన క్లోజయింది. ఇంట్రాడేలో 200 డీఎంఏ 11,685ను కోల్పోగా, చివరికి ఒక శాతం నష్టంతో 11,678.50 వద్ద క్లోజయింది. ఒకవైపు అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ ప్రతికూలతలు, ప్రపంచ మార్కెట్ల పతనం మన మార్కెట్లపైనా చూపించింది. దీనికితోడు ఎఫ్‌అండ్‌వో గురువారం ఎక్స్‌పైరీ అవుతుండడం కూడా అస్థిరతలను పెంచింది. అయితే, గురువారం మార్కెట్లలో పుల్‌బ్యాక్‌ ర్యాలీ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.    ‘‘ఈ సమయంలో

ఎల్‌ఐసీ ఐపీఓ బీమారంగానికి ప్రయోజనమే!

Wednesday 26th February 2020

ఫిచ్‌ రేటింగ్స్‌ దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఐపీఓకు రావడం శుభపరిణామని బుధవారం ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ అభిప్రాయపడింది. ఐపీఓ కారణంగా ఎల్‌ఐసీ పారదర్శకత, జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని రేటింగ్‌ సంస్థ తెలిపింది. అలాగే దేశీయ బీమా పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో దేశీయ బీమారంగం కొంత వెనకబడింది. ఎల్ఐసీ లాంటి పెద్ద బీమా సంస్థ ఐపీఓ రానున్న నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు బీమారంగంలో తన పెట్టుబడుల

Most from this category