News


భారీ డివిడెండ్ల చెల్లింపునకు కంపెనీలు సిద్ధం!

Thursday 27th February 2020
news_main1582784192.png-32136

కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు అమల్లోకి రాకమునుపే కంపెనీలు డివిడెండ్‌ను చెల్లించడానికి హడావిడి చేస్తున్నాయి. ఏప్రిల్ 1 తర్వాత వచ్చే డివిడెండ్లపై ప్రమోటర్లు దాదాపు 43 శాతం పన్ను చెల్లించాల్సి ఉండటం ఇందుకు కారణమైంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి(ఫిబ్రవరి 1) నుంచి ఇప్పటికి వరకు 204 కంపెనీలు డివిడెండ్లను ప్రకటించాయి. మరో 32 కంపెనీలు డివిడెండ్లపై నిర్ణయం తీసుకోనేందుకు రాబోయే మూడు రోజుల్లో బోర్డు సమావేశాలను నిర్వహించనున్నాయి. 2019లో 90కంపెనీలు, 2018లో 98 కంపెనీలు మాత్రమే డివిండెండ్లను ప్రకటించాయి.

  • బజాజ్ ఆటో కంపెనీ  ఫిబ్రవరి 21న జరిగిన బోర్డు సమావేశంలో ప్రతి షేరుకు 1,200శాతం (లేదా) రూ.120 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇదే కంపెనీ గడిచిన 2018, 2019 ఏడాదిల్లో మే నెలలో డివిడెండ్‌ను ప్రకటించడం గమనార్హం.
  • శ్రీ సిమెంట్‌ కంపెనీ ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు సమావేశంలో రూ.10లు ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు 1100శాతం(రూ.110) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. అంతకు ముందు 2018, 2019 జనవరి ప్రకటించిన ఈ మధ్యంతర డివిండెండ్‌ కేవలం 250 శాతంగా మాత్రమే ఉంది.
  •  సింఫని కంపెనీ ఫిబ్రవరి 7న జరిగిన బోర్డు సమావేశంలో ప్రతిషేరుపై 900శాతం స్పెషల్‌ డివిడెండ్‌ను ప్రకటించింది. దీవిస్‌ ల్యాబ్స్‌ ఫిబ్రవరి 12న ప్రతిషేరుపై 800శాతం డివిడెండ్‌ను ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇదే కంపెనీ గడిచిన మూడేళ్లలో మే నెలలో డివిడెండ్‌ను ప్రకటించింది. 
  • బాలకృష్ట ఇండస్ట్రీస్‌ కంపెనీ ఫిబ్రవరి 14న ప్రతిషేరుకు 800శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇదే కంపెనీ 2019లో ఫిబ్రవరిలో 100శాతం, 2018లో 75శాతం మాత్రమే డివిడెండ్‌ను ప్రకటించింది. 

 ప్రస్తుతం కంపెనీల షేర్ హోల్డర్లు దేశీయ కంపెనీల నుంచి పొందే డివిడెండ్ ఆదాయం రూ.10 లక్షల లోపు ఉంటే పన్ను అవసరం లేదు. అయితే రూ. 10 లక్షలకు మించి డివిడెండ్ ఆదాయం పొందినట్లైతే 10 శాతం పన్ను(సూపర్‌ రిచ్‌ డివిడెండ్‌ టాక్స్‌) చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (డిడిటి) రద్దు చేసిన తరువాత, వాటాదారులు అందుకున్న డివిడెండ్‌ పైన మాత్రం వారికి వర్తించే రేటుకు అనుగుణంగా పన్ను విధించడం జరుగుతుంది. ఈ విధానం కంపెనీలకు ‍అనుకూలంగానూ.. ప్రమోటర్లు, పెద్ద ఇన్వెస్టర్లకు ప్రతికూలంగా ఉంది. ప్రమోటర్లపై పన్ను భారం అధికంగా 43 శాతం వరకు వుంటుంది.

చాలా మంది ప్రమోటర్ యజమానులు వ్యక్తిగతంగా లేదా ట్రస్టులలో ఈక్విటీని కలిగి ఉండటంతో పాటు ఎగువ పన్ను పరిధిలో ఉన్నారు. కొత్త విధానం ప్రకారం వారు ఏప్రిల్ 1 తరువాత డివిడెండ్లను స్వీకరించినట్లైతే 43 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అధిక ప్రమోటర్ హోల్డింగ్ ఉన్న కంపెనీల వాటాదారులు మార్చి 31 లోపు డివిడెండ్ ప్రకటిస్తున్నాయని ఆసోసియేషన్‌ ఆఫ్‌ ఎక్చ్సేంజ్‌ ఆఫ్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎన్‌ఎంఐ) అధ్యక్షుడు భూషణ్‌ తెలిపారు. 

తాత్కాలిక డివిడెండ్ చెల్లించడానికి ఇదే విధమైన హడావిడి 2002 లో జరిగింది. షేర్‌హోల్డర్ల చేతిలో ఉన్న డివిడెండ్లను పన్ను పరిధిలోకి తీసుకురావాలని యశ్వంత్ సిన్హా ప్రతిపాదన ఇందుకు కారణమైంది. అలాగే 2007-08 బడ్జెట్ సమర్పించిన తరువాత మార్చి 2007 లో... అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం డివిడెండ్ పంపిణీ పన్ను డీడీటీ) ను 12.5 శాతం నుండి 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించినప్పుడు, రికార్డు స్థాయిలో 300 లిస్టెడ్ కంపెనీలు మధ్యంతర డివిడెండ్ చెల్లించే ప్రణాళికలను ప్రకటించాయి. 

ఇప్పటివరకు డివిడెండ్లను ప్రకటించిన కొన్ని ప్రధాన కంపెనీలు
క్రమసంఖ్య కంపెనీ పేరు డివిడెండ్‌(రూపాయల్లో..)
1 హీరోమోటోకార్ప్‌ 65.00
2 క్రిసెల్‌ 13.00
3 టైడ్‌ వాటర్‌ ఆయిల్‌ కంపెనీ 60.00
4 బజాజ్‌ ఆటో 120.00
5 ఆల్కేమ్‌ ల్యాబ్స్‌ 22.00
6 శ్రీ సిమెంట్స్‌ 110.00
7 సింఫనీ  18.00
8 దివీస్‌ ల్యాబ్స్‌ 16.00
9 బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 16.00
10 నెస్లే ఇండియా 61.00
11 స్టెర్లింగ్‌ విల్సన్‌ సోలార్‌  6.00
12 ధనుకా ఆగ్రిటెక్‌ 12.00
13 పేజ్‌ ఇండస్ట్రీస్‌ 58.00
14 ఎన్‌ఎండీసీ  5.29
15 లక్స్‌ ఇండస్ట్రీస్‌  10.00
16 జేబీ కెమ్స్‌ ఫార్మా 10.00
17 మహారాష్ట్ర స్కూటర్స్‌ 50.00
18 బజాజ్‌ ఫైనాన్స్‌ 10.00
19 అవంతీ ఫీడ్స్‌ 5.00
20 చెవియోట్  48.00
21 మెట్రోపోలీస్‌ హెల్త్‌కేర్‌ 8.00 

 



You may be interested

సుప్రీం తీర్పుతర్వాతే నిర్ణయం: భారతీ ఇన్‌ఫ్రాటెల్‌

Thursday 27th February 2020

ఇండస్‌ టవర్స్‌ విలీనంపై భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ ఇండస్‌​ టవర్స్‌ను విలీనం చేసుకోవడంతో పాటు, ఇండస్‌ టవర్స్‌లో వొడాఫోన్‌ ఐడియాకు ఉన్న 7 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని క్లియరెన్స్‌లు పూర్తయినప్పటికి ఇండస్‌ టవర్స్‌ విలీనంతోపాటు, టవర్స్‌లోని వొడాఫోన్‌ ఐడియా 7 శాతం వాటా కొనుగోలు ప్రక్రియను  మరో రెండు నెలలు పొడిగించనుంది. వొడాఫోన్‌ ఐడియాకు నగదు కొరతతో అనిశ్చితి నెలకొనడం,

ఎస్‌బీఐ టార్గెట్‌ ధరను 14 శాతం పెంచిన మోర్గాన్‌

Thursday 27th February 2020

ఎస్‌బీఐ అనుబంధ సంస్థలైన మ్యూచువల్‌ ఫండ్‌, లైఫ్‌ ఇన్సురెన్స్‌, కార్డ్స్‌ బిజినెస్‌ మంచి పనితీరు కనబరుస్తుండడంతో ఎస్‌బీఐ టార్గెట్‌ ధరను మోర్గాన్‌ స్టాన్లీ బ్రోకరేజ్‌ సంస్థ 14 శాతం పెంచి రూ.375గా  నిర్ణయించింది. ఆస్తి నాణ్యత, అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని రేటింగ్‌ని నిలిపి ఉంచినట్లు తెలిపింది. ఎస్‌బీఐకు చెందిన ఏఎంసీ, కార్డ్స్‌, లైఫ్‌ఇన్సురెన్స్‌లు విలువ పెంచుకుని లాభాన్ని ఆర్జిస్తాయని మోర్గాన్‌స్టాన్లీ విశ్లేషకులు సుమీత్‌ కరివాల వెల్లడించారు.  అంతేగాక అనుబంధ సంస్థలన్నీ

Most from this category