News


ఆంధ్రప్రదేశ్‌లో జీపీఎస్‌ ట్రాకర్స్‌ తయారీ కేంద్రం

Tuesday 26th November 2019
news_main1574742046.png-29855

  • ముందుకొచ్చిన వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్‌
  • ప్లాంటు కోసం రూ.50 కోట్ల దాకా వ్యయం

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జీపీఎస్‌, ఐవోటీ పరికరాల తయారీ సంస్థ వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్‌... ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మంగళగిరి సమీపంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ రూ.50 కోట్ల దాకా వెచ్చించనుంది. రోజుకు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తామని, 2020 జూలై నాటికి తయారీ ప్రారంభమవుతుందని వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్‌ ఫౌండర్‌ కోణార్క్‌ చుక్కపల్లి చెప్పారు.  సేల్స్‌ డైరెక్టర్‌ పి.ఆర్‌.రాజారామ్‌తో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్లాంటులో ఏఐఎస్‌ 140 ప్రమాణాలు గల జీపీఎస్‌ పరికరాలను రూపొందిస్తామని, ఈ కేంద్రం ద్వారా 400-500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. హైదరాబాద్‌ ప్లాంటు సామర్థ్యం రోజుకు 1,000 యూనిట్లని ఈ సందర్భంగా తెలియజేశారు.
పరికరాలకు భారీ డిమాండ్‌...
నవంబరు 26 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్‌ ట్రాకర్ల వాడకం తప్పనిసరి చేశారు. 25,000 వాహనాల దాకా ఇసుక రవాణాలో నిమగ్నమై ఉన్నట్లు కోణార్క్‌ తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏఐఎస్‌ 140 ధ్రువీకరణ పొందిన ఏకైక కంపెనీ మాదే. ఏపీలో ఉన్న డిమాండ్‌ కంపెనీకి కలిసొస్తుంది. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఇప్పటికి 2 లక్షల పైగా పరికరాల్ని విక్రయించాం. ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్‌ ట్రాకర్ల వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించాలని లక్ష్యించాం. ఏప్రిల్‌-సెప్టెంబరులో 70,000 యూనిట్లు విక్రయించాం. ఏపీ ప్లాంటు కోసం వచ్చే ఏడాది మే నాటికి రూ.35 కోట్ల దాకా నిధులు సమీకరించనున్నాం’ అని వివరించారు. 



You may be interested

12200 వరకు నిఫ్టీ పరుగు!

Tuesday 26th November 2019

టెక్నికల్స్‌ సంకేతాలు దేశీయ మార్కెట్లు ఈవారాన్ని మంచి లాభాలతో ఆరంభించాయి. మంగళవారం ఆరంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ రికార్డు గరిష్ఠాలను చేరింది. ఇకపై నిఫ్టీకి 12140- 12150 పాయింట్ల రేంజ్‌లో చిన్న పాటి అవరోధం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆ పైన 12200 పాయింట్లను చేరడం ఖాయంగా సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ఇప్పటికే 12వేలు, 12100 పాయింట్ల కాల్‌రైటర్లు తమ షార్ట్స్‌ను కవర్‌ చేసుకోవడం ఆరంభించారు. నిఫ్టీ 12200- 12250పాయింట్లు చేరిన తర్వాత ప్రాఫిట్‌

కోడిగుడ్లతో ఏటా రూ.7,500 కోట్ల నష్టం!

Tuesday 26th November 2019

గిట్టుబాటు ధర లేకపోవటమే కారణం తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 8.5 కోట్ల గుడ్ల ఉత్పత్తి రూ.1.1 లక్షల కోట్లకు చేరిన దేశీ పౌల్ట్రీ పరిశ్రమ ఐపీఈఎంఏ ప్రెసిడెంట్‌ చక్రధర రావు పొట్లూరి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గిట్టుబాటు ధర లేకపోవటం, మొక్కజొన్న, సోయాబిన్‌ లభ్యత తక్కువగా ఉండటం, దాణ ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిదారులు ఏటా రూ.7,500 కోట్లు నష్టపోతున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. ఏటా దేశంలో 8,800

Most from this category