News


భారత్‌ కంపెనీలపై వివక్ష వద్దు: కేంద్రం

Tuesday 10th December 2019
news_main1575950765.png-30146

న్యూఢిల్లీ: భారత్‌ కంపెనీలపై వివక్ష  ప్రదర్శించవద్దని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అలాంటి ధోరణిని అవలంబించే దేశాల కంపెనీలకూ భారత్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుందని న్యూఢిల్లీలో ఎగ్జిమ్‌ బ్యాంక్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన హెచ్చరించారు. ‘‘ఏదైనా దేశం తమ దేశంలో కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో భారత్‌ కంపెనీలపై వివక్ష చూపిస్తే, సంబంధిత దేశ కంపెనీలను కూడా  భారత్‌ పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కాంట్రాక్ట్‌ల బిడ్డింగ్‌లో పాల్గొనకుండా తగిన విధాన నిర్ణయం ఉంటుంది’’ అని గోయల్‌ పేర్కొన్నారు. 



You may be interested

ఎస్‌బీఐలో పుట్‌ లాడర్‌ వ్యూహం బెటర్‌!

Tuesday 10th December 2019

నిపుణుల సలహా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు పోర్టుఫోలియోలో ఉండి తాజాగా షేరు పతనంతో ఏం చేయాలో తెలియక సతమతమయ్యే రిటైల్‌ ఇన్వెస్టర్లు పుట్‌ల్యాడర్‌ వ్యూహం అవలంబించడం ద్వారా నష్టాలు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో ఎస్‌బీఐని టాప్‌పిక్‌గా పలువురు పరిగణిస్తారు. అందువల్ల ప్రస్తుతం కొంత వెనుకంజ వేసినా, షేరు తిరిగి పుంజుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా పతనంలో భాగంగా షేరు 290 రూపాయల వరకు దిగిరావచ్చని, ఈ

పెట్టుబడుల వృద్ధికే కార్పొరేట్‌ పన్ను కోత: సీఈఏ

Tuesday 10th December 2019

న్యూఢిల్లీ: పెట్టుబడులు పుంజుకోవడమే లక్ష్యంగా కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని కేం‍ద్రం తీసుకున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన ఫిక్కీ యంగ్‌ లీడర్స్‌ సదస్సులో సుబ్రమణియన్‌ మాట్లాడుతూ... ఆర్థిక వృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు ఎంతో కీలకమైనవన్నారు. కార్పొరేట్ పన్ను రేటును 30 నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించడం తెలిసిందే.

Most from this category