News


ప్రభుత్వ చర్యలు నిరాశపరిచాయి: క్రెడాయ్‌

Monday 16th September 2019
news_main1568606889.png-28391

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కేంద్రం ప్రకటించిన చర్యలు నిరాశపరిచినట్టు ఆ రంగానికి చెందిన అత్యున్నత సంఘం క్రెడాయ్‌ అభిప్రాయపడింది. పన్ను రాయితీలు, గృహ కొనుగోలుదారులకు, గృహ నిర్మాణదారులకు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వాలనే డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. నిలిచిపోయిన ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రకటించిన నిధి ప్రభావం పరిమితమేనని, ఎందుకంటే దివాలా చర్యలు ఎదుర్కొంటున్నవి, ఎన్‌పీఏలుగా మారిన ప్రాజెక్టులను ఈ ప్యాకేజీ నుంచి మినహాయించడమేనని గుర్తు చేసింది. ‘‘గత నెల ఆర్థిక మంత్రిని కలసి పలు డిమాండ్లను తెలియజేశాం. లిక్విడిటీని పెంచాలని, రియల్‌ఎస్టేట్‌ రంగంలో డిమాండ్‌ను పెంచాలని కోరడం జరిగింది. కానీ, దురదృష్టవశాత్తూ మా డిమాండ్లను నెరవేర్చలేదు’’ అని క్రెడాయ్‌ నేషనల్‌ చైర్మన్‌ జాక్సాయ్‌ షా పేర్కొన్నారు. రాయితీ పథకాన్ని రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇది గృహ కోనుగోలుదారులకు మేలు చేస్తుందని, తద్వారా డిమాండ్‌ మెరుగుపడుతుందన్నారు. వడ్డీ రాయితీ పథకం కింద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు రుణాలను ఆఫర్‌ చేయకుండా నేషనల్‌హౌసింగ్‌ బ్యాంకు జూలైలో ఆదేశాలు జారీ చేసింది. దీని కింద డెవలపర్లే కొనుగోలుదారులకు ఫ్లాట్లను అప్పగించేంత వరకు వడ్డీని చెల్లించేవారు. 



You may be interested

స్థిర రేటుపై గృహ రుణాలు

Monday 16th September 2019

కొంత కాలం తర్వాత ఫ్లోటింగ్‌ రేటు తీసుకొచ్చే యోచనలో ఎస్‌బీఐ ఆర్‌బీఐ నుంచి స్పష్టత కోరిన బ్యాంకు లేహ్‌: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ స్థిర రేటుపై గృహ రుణాలను తీసుకురావాలనుకుంటోంది. ఇవి స్థిర రేటు (ఫిక్స్‌డ్‌) నుంచి అస్థిర రేటు(ఫ్లోటింగ్‌)కు మారే గృహ రుణాలు. అంటే ప్రారంభం నుంచి నిర్ణీత కాలం వరకు (సుమారు ఐదు పదేళ్లు) ఒకటే వడ్డీ రేటు కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా గృహ

తగ్గిన మారుతీ సుజుకీ మార్కెట్‌ వాటా

Monday 16th September 2019

ఏప్రిల్‌-ఆగస్టు కాలంలో 2 శాతం పతనం న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌-ఆగస్టు కాలంలో గణనీయంగా తగ్గాయి. భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ కాలంలో 11,09,930 యూనిట్లు అమ్ముడు కాగా, గతేడాది ఇదే కాలంలో 14,51,647 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.  ద్రవ్యలభ్యత కొరత, అధిక బీమా, భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనల అమలు వంటి ప్రతికూల

Most from this category