News


ఐపీవో బాటలో గ్రామీణ బ్యాంకులు

Monday 29th July 2019
Markets_main1564384340.png-27378

- ఈ ఏడాదే 3-4 బ్యాంకులు పబ్లిక్ ఇష్యూకి వచ్చే అవకాశం
న్యూఢిల్లీ: ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) కొన్నింటిని స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయ్యాక ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3-4 ఆర్‌ఆర్‌బీల పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు 45 దాకా ఉన్న ఆర్‌ఆర్‌బీల సంఖ్యను విలీన ప్రక్రియ ద్వారా 38కి తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అనుమతులివ్వడంతో మరికొన్ని ఆర్‌ఆర్‌బీల విలీనం కూడా జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. వ్యయాలు తగ్గడం, టెక్నాలజీని మెరుగ్గా వినియోగించుకోగలగడం, మూలధన పరిమాణాన్ని.. కార్యకలాపాల విస్తృతిని పెంచుకోవడం ప్రాతిపదికగా రాష్ట్రాల పరిధిలోని ఆర్‌ఆర్‌బీల విలీనం జరుగుతోందని పేర్కొన్నాయి. గడిచిన కొద్ది నెలల్లో 21 బ్యాంకుల విలీం జరిగినట్లు తెలిపాయి. 

రైతులకు బాసటగా ఏర్పాటు...
గ్రామీణ ప్రాంతాల్లోని సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల మొదలైనవారికి రుణాలతో పాటు ఇతరత్రా ఆర్థిక సేవల సదుపాయాలను అందించే లక్ష్యంతో 1976 ఆర్‌ఆర్‌బీ చట్టం కింద గ్రామీణ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. 2005 నుంచి దశలవారీగా ఆర్‌ఆర్‌బీల కన్సాలిడేషన్‌ను కేంద్రం అమలు చేస్తోంది. దీంతో 2005 మార్చి ఆఖరుకు 196గా ఉన్న ఆర్‌ఆర్‌బీల సంఖ్య 2012 నాటికి 82 స్థాయికి తగ్గింది.  ప్రస్తుతం ఆర్‌ఆర్‌బీల్లో 50 శాతం వాటా కేంద్రానికి, 35 శాతం వాటా స్పాన్సర్ బ్యాంకులు, 15 శాతం వాటా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉంటోంది. 2015లో చేసిన చట్ట సవరణ ప్రకారం ఈ బ్యాంకులు కేంద్రం, రాష్ట్రాలు, స్పాన్సర్ బ్యాంకులతో పాటు ఇతరత్రా మార్గాల ద్వారా కూడా పెట్టుబడి సమకూర్చుకోవచ్చు. 2019-20 బడ్జెట్‌లో ఆర్‌ఆర్‌బీలకు కేంద్రం రూ. 235 కోట్ల మేర అదనపు మూలధనం కేటాయించింది. చట్టం ప్రకారం ఒకవేళ ఐపీవోకి వచ్చినా ఆర్‌ఆర్‌బీల్లో కేంద్రం, స్పాన్సర్ బ్యాంకుల వాటాలు 51 శాతానికి తగ్గకూడదు. తద్వారా యాజమాన్యం, నియంత్రణాధికారాలు అన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. 



You may be interested

ఆర్‌బీఐ మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తే మంచిది : నిర్మల సీతారామన్

Monday 29th July 2019

ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్‌బీఐ మరో సారి వడ్డీ రేట్లు తగ్గింపు అవసరమని తాను భావిస్తున్నానని, ఆటోమొబైల్ రంగంలో తిరోగమనంతో సహా ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మల సీతారామన్  ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆమె మాటల్లోనే.. అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తున్నాం.. అంతర్జాతీయంగా డిమాండ్‌ ఆందోళనలున్నాయి. ఐఎంఎఫ్‌(ఇంటర్నేషనల్‌ మానెటరీ ఫండ్‌), ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ తమ

రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం..

Monday 29th July 2019

- ప్రథమార్ధంలో దాదాపు రూ. 18,900 కోట్ల నిధులు ముంబై: నియంత్రణ విధానాలపరమైన ప్రతికూల పరిస్థితులతో రియల్టీ రంగం కార్యకలాపాలు మందకొడిగా ఉన్నప్పటికీ.. పెట్టుబడులు మాత్రం భారీగానే వస్తున్నాయి. 2019 ప్రథమార్ధంలో 2.7 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 18,900 కోట్లు) వచ్చాయని ప్రాపర్టీల నిర్వహణ సంస్థ వెస్టియాన్‌, పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2015-2018 మధ్యకాలంలో రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం 25.7 బిలియన్ డాలర్ల

Most from this category