News


డిజిటల్ మీడియాలో విదేశీ పెట్టుబడులు

Tuesday 27th August 2019
news_main1566878346.png-28035

  • బొగ్గు, కాంట్రాక్ట్ తయారీ రంగ నిబంధనల సడలింపు
  • 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు
  • మరో విడత సంస్కరణలపై కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డిజిటల్ మీడియాతో పాటు పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పూర్తి స్థాయిలో అనుమతించే దిశగా మరో విడత సంస్కరణలపై కసరత్తు చేస్తోంది. వీటిలో భాగంగా బొగ్గు, కాంట్రాక్ట్ తయారీ రంగానికి సంబంధించి కూడా ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేయనుంది. కేంద్ర క్యాబినెట్ త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంట్రాక్ట్ తయారీ రంగంలో కూడా 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే ప్రతిపాదన కేంద్రం పరిశీలిస్తున్నట్లు వివరించాయి. ప్రస్తుతం తయారీ రంగంలోకి ఆటోమేటిక్‌ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. వీటి ప్రకారం తయారీదారు భారత్‌లో తయారు చేసిన ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోనక్కర్లేకుండా హోల్‌సేల్‌, రిటైల్‌ (ఈ-కామర్స్ సహా) మార్గాల్లో విక్రయించుకోవచ్చు. అయితే, దీనికి సంబంధించిన విధానంలో కాంట్రాక్ట్ తయారీ విభాగం ప్రస్తావన లేకపోవడంతో అస్పష్టత నెలకొంది. "ప్రపంచవ్యాప్తంగా పెద్ద టెక్నాలజీ సంస్థలన్నీ కాంట్రాక్టు తయారీ విధానాన్నే పాటిస్తున్నందున.. దీనిపై స్పష్టతనివ్వాల్సిన అవసరం ఏర్పడింది" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

డిజిటల్‌పైనా స్పష్టత...
ఇక మీడియా విషయానికొస్తే ప్రస్తుతం ప్రింట్‌ మీడియాలో ప్రభుత్వ ఆమోదం మేరకు 26 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. అలాగే ఇదే మార్గంలో బ్రాడ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ సర్వీసుల విభాగంలోనూ 49 శాతం దాకా పెట్టుబడులకు అనుమతులు ఉన్నాయి. అయితే, డిజిటల్ మీడియా రంగ ప్రస్తావన మాత్రం లేకపోవడంతో తాజాగా దీనిపైనా స్పష్టతనివ్వాల్సిన అవసరం వచ్చింది. 

 



You may be interested

ఫుడ్‌ యాప్స్‌పై హోటళ్ల గుస్సా!!

Tuesday 27th August 2019

న్యూఢిల్లీ: జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్‌, ఫుడ్‌పాండా వంటి ఆన్‌లైన్ ‍ఫుడ్‌ డెలివరీ అగ్రిగేటర్స్‌ భారీ డిస్కౌంట్లు ఇస్తుండటాన్ని హోటళ్ల సమాఖ్య నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) తీవ్రంగా ఖండించింది. అగ్రిగేటర్స్‌ సంస్థలు.. తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని, తక్షణమే ఈ విధానాలను మానుకోవాలని పేర్కొంది. ఎన్‌ఆర్‌ఏఐలో సభ్యత్వం ఉన్న రెస్టారెంట్లన్నీ లాగ్‌అవుట్ ఉద్యమాన్ని ఇతర ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫాంలకు కూడా విస్తరించాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ .. అగ్రిగేటర్స్‌తో

ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ

Tuesday 27th August 2019

ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ ఏటీఎంల నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు.. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్‌ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్‌ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10,000 ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘‘కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉపసంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10,000కు మించి చేసే నగదు విత్‌ డ్రాయల్స్‌

Most from this category